సోనూ సూద్‌ హీరోగా టాలీవుడ్‌లో ఒక సినిమా  

Sonu Sood as Hero in Tollywood Movie,Sonu Sood, Real hero, Producer, Tollywood - Telugu Producer, Real Hero, Sonu Sood, Sonu Sood As Hero In Tollywood Movie, Tollywood

ఈ కరోనా టైంలో సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోనూసూద్‌. రియల్‌ హీరో అంటూ ఆయన్ను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

 Sonu Soodh Hero In Tollywood Movie

లాక్‌డౌన్‌ సమయంలో దాదాపుగా 30 వేల మంది వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు తరలించడంలో తనదైన పాత్రను ఎవరు మర్చిపోలేరు.విమానంలో కూడా వలస కార్మికులను చేరవేసిన ఘనత సోనూసూద్‌కు దక్కుతుంది.

అలాంటి సోనూసూద్‌ ఆ తర్వాత కూడా మంచి పనులు చేస్తూనే ఉన్నాడు.ఇటీవల తెలుగు రైతు నాగేశ్వరరావుకు మరియు సాఫ్ట్‌వేర్‌ శారదకు ఈయన చేసిన సాయంతో తెలుగు జనాల్లో రియల్‌ హీరోగా మారిపోయాడు.

సోనూ సూద్‌ హీరోగా టాలీవుడ్‌లో ఒక సినిమా-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.అందుకే టాలీవుడ్‌లోని ఒక నిర్మాత ఆయన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు సిద్దం అయ్యాడు.ఆయనతో ఒక పాన్‌ ఇండియా మూవీని నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు.సోనూసూద్‌ హీరోగా ఆయన పద్దతికి దగ్గరగా అంటే సాయం చేసే వ్యక్తిగా రెగ్యులర్‌ చిత్రాలకు బిన్నంగా ఒక తెలుగు సినిమాను రూపొందించాలని భావిస్తున్నాడు.

అందుకోసం స్క్రిప్ట్‌ కూడా రెడీ అయ్యింది.త్వరలోనే సోనూసూద్‌కు వినిపించే అవకాశం ఉంది.

సోనూసూద్‌ ఇప్పటి వరకు విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించాడు.దాదాపు దశాబ్ద కాలంగా ఇండియన్‌ స్క్రీన్‌పై విలన్‌గా తనదైన ముద్రను వేశాడు.అలాంటి సోనూసూద్‌ ఇప్పుడు హీరోగా నటించడం అంటే ఎలా ఉంటుందో అనే ఆలోచన కొందరికి కలుగుతుంది.కాని అసలు విషయం ఏంటీ అంటే ఇప్పుడు సోనూసూద్‌ విలన్‌గా చేస్తే ఆయన అభిమానులు ఒప్పుకోక పోవచ్చు.

అందుకే హీరోగానే చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Producer #Sonu Sood #Real Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonu Soodh Hero In Tollywood Movie Related Telugu News,Photos/Pics,Images..