విలన్‌ మంచి మనసు, వారికి రూ.4 కోట్ల సాయం  

Sonu Soodh Help The 400 Family\'s Each Family\'s His Give One Lakh Ruppes, Sonu Soodh, Bollywood, Daily Wage Workers, Sonu Soodh Help The 400 Family\'s, Sonu Soodh Latest Update, Coronavirus, Lock Down, Tollywood - Telugu Bollywood, Coronavirus, Daily Wage Workers, Lock Down, Sonu Soodh, Sonu Soodh Help The 400 Family\\'s, Sonu Soodh Latest Update, Tollywood

కరోనా సమయంలో పలువురి స్టార్స్‌ మంచి మనసు బయట పడినది.తమతోటి వారు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

 Sonu Soodh Bollywood Daily Wage Workers Coronavirus

ముఖ్యంగా కొందరు తమ స్థాయిని మించి కూడా సాయం చేశారు.టాలీవుడ్‌లో విలన్‌గా ఎన్నో చిత్రాలతో అలరించిన సోనూసూద్‌ వలస కార్మికుల దేవుడు అయ్యాడు.

ముంబయితో పాటు పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 30 వేల మంది వలస కార్మికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చాడు.వలస కూలీల కోసం ఏకంగా ప్రత్యేక విమానంను ఏర్పాటు చేసిన ఘనత కేవలం సోనూసూద్‌కు మాత్రమే దక్కింది.

విలన్‌ మంచి మనసు, వారికి రూ.4 కోట్ల సాయం-Movie-Telugu Tollywood Photo Image

దేశంలో సోనూసూద్‌ పేరు మారుమ్రోగిపోయింది.తన సేవ కార్యక్రమాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.తాజాగా సోనూసూద్‌ కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు.వలస కూలీలు ఎంతో మంది వారి వారి ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో వివిధ కారణాలతో మృతి చెందారు.

దాంతో వారి కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.దాదాపుగా 400 మంది కుటుంబాలకు సోనూ సూద్‌ లక్ష రూపాయల చొప్పున సాయం చేసేందుకు సిద్దం అయ్యాడు.

కుటుంబంకు లక్ష సాయం చేసినా కూడా దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు సోనూసూద్‌కు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.వారివారి కుటుంబ పరిస్థితిని బట్టి కొన్ని కుటుంబాలకు కాస్త ఎక్కువ సాయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.అంటే నాలుగు కోట్లకు మించే కాని తక్కువ అయితే కాకుండా సోనూసూద్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.ఇంత మంచి వ్యక్తి దేశంలో లేడంటూ ఆయనపై మరోసారి సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

#Lock Down #Coronavirus #Sonu Soodh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonu Soodh Bollywood Daily Wage Workers Coronavirus Related Telugu News,Photos/Pics,Images..