మరో సారి మానవత్వం చాటుకున్న సోనూసూద్...ఏం చేసాడంటే?

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనం చూసాం.అయితే ఆ సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సామాన్య ప్రజలు ఎంతలా అల్లాడిపోయారో మనం చూసాం.

 Sonu Sood Who Once Again Expressed His Humanity What Did He-TeluguStop.com

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు ఉన్న ఫలంగా సొంత ఊర్లకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.అప్పుడు మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఎటువంటి వాహనాలు అందుబాటులో లేక ఇక వలస కార్మికులు కాలినడకన కొన్ని వేల కిలోమీటర్లు నడవడం మొదలు పెట్టారు.

అటువంటి క్లిష్ట పరిస్థితులలో వారినందరినీ దేవుడిలా ఆదుకున్న ఒకే ఒక వ్యక్తి నటుడు సోనూసూద్.

 Sonu Sood Who Once Again Expressed His Humanity What Did He-మరో సారి మానవత్వం చాటుకున్న సోనూసూద్…ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారినందరిని సొంత ఖర్చులతో బస్సులలో వారి ఇండ్ల వరకు చేర్చి వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు.

ఒక్క కరోనా సమయంలోనే కాకుండా వైద్య సహాయం కోసం బాధపడుతున్న వారి కుటుంబాల్ని ఆడుకుంటూ వైద్యం అందిస్తూ ఆడుకుంటున్నాడు.ఇలా సోనూసూద్ దేశ వ్యాప్తంగా ప్రజల మన్ననలు అందుకున్నాడు.

తాజాగా ఓ గ్రామ ప్రజల నీటి కష్టాలను సోనూసూద్ తీర్చాడు.నీటి కొరకు వేల కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తోందని తెలుసుకున్న సోనూసూద్ వారి గ్రామంలో చేతి పంపులను ఏర్పాటు చేశారు.

అయితే త్వరలో ఆ గ్రామాన్ని సందర్శించి ఆ పంపు నీళ్లు తాగేందుకు ఆ ఊరికి వెళ్తానని సోనూసూద్ తెలిపారు.ఏది ఏమైనా ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నా అంటూ ముందుకెళ్తున్న సోనూసూద్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

#@fcsonusood #Lockdown #Corona #Hero Sonusood #Actor Sonusood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు