కంగనా అసలు సమస్య ఏంటీ? మణికర్ణిక చివరికి ఏంటీ పరిస్థితి?  

Sonu Sood Walks Out Of Manikarnika Movie-

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మణికర్ణిక’.వీర నారి జాన్సీలక్ష్మీ భాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకు విజయేంద్ర ప్రసాద్‌ కథను అందింగచగా, క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నట్లుగా మొదట ప్రకటన వచ్చింది.హిందీలో ఈ చిత్రంతో క్రిష్‌ స్థాయి ఎక్కడికో వెళ్తుందని అంతా భావించారు..

Sonu Sood Walks Out Of Manikarnika Movie--Sonu Sood Walks Out Of Manikarnika Movie-

కాని అనూహ్యంగా ఈ చిత్రం నుండి క్రిష్‌ తప్పుకున్నాడు.క్రిష్‌ తప్పుకోవడానికి ప్రధాన కారణం హీరోయిన్‌ కంగనా రనౌత్‌ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో కంగనా ఇన్వాల్వ్‌మెంట్‌ ఎక్కువ అవ్వడంతో పాటు, నిర్మాతలు ఆమెకు మద్దతుగా నిలిచిన కారణంగానే క్రిష్‌ సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.క్రిష్‌ వర్క్‌ విషయంలో కంగనా మరియు నిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో పాటు, కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయడంకు పట్టుబట్టారు.

దాంతో చేసేది లేక క్రిష్‌ తప్పుకున్నాడు.తాజాగా క్రిష్‌ దారిలోనే నటుడు సోనూసూద్‌ నడిచాడు.సోనూసూద్‌ తాజాగా చిత్రం నుండి తప్పుకున్న కారణంగా సినిమాపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

సోనూసూద్‌ పాత్రకు సంబంధించిన ఇప్పటికే చిత్రీకరించిన సీన్స్‌ను కంగనా తీసేయాలని నిర్ణయించుకుంది.ఆయన పాత్రకు ప్రాముఖ్యత తగ్గించడంతో పాటు, కాస్త చులకన భావంతో వ్యవహరించిన కారణంగానే సోనూసూద్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.సోనూసూద్‌ వెళ్లి పోవడంతో కంగనా రివర్స్‌ ఎటాక్‌ చేసింది.ఒక మహిళ దర్శకత్వంలో నటించడం అతడికి ఇష్టం లేదు కాబోు అంటూ సోనూసూద్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ‘మణికర్ణిక’ చిత్రం చివరకు ఎటువైపు వెళ్తుందో అని, హీరోయిన్‌ కంగనా రనౌత్‌ దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఎలా ఇన్వాల్వ్‌ అవుతుందో ఆమెకే తెలియాలి అంటూ కొందరు బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.ఎవరేం అనుకున్నా కూడా తాను అనుకున్నది తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటున్న కంగనా రనౌత్‌ చివరకు ఎలాంటి ఔట్‌ పుట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుందో చూడాలి.