భార్య భర్తల గొడవకు సోనూసూద్‌ ఇచ్చిన ఆన్‌లైన్‌ సలహా వైరల్‌  

Sonu Sood Tweet Goa Viral Post - Telugu Sonu Sood, Sonu Sood Suggestion To Wife And Husband, Sonu Sood Tweets, Viral Post

వలస కార్మికులు కాలి నడకన వందల కిలో మీటర్లు నడిచి వెళ్తుంటే మనసు బాధపడ్డ ప్రముఖ నటుడు సోనూసూద్‌ వారికోసం బస్సులు ఏర్పాటు చేసి మరీ వారి సొంత ప్రాంతాలకు తరలించిన విషయం తెల్సిందే.ఇప్పటి వరకు వేలాది మందిని వారి వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు రవాణ సౌకర్యంను కల్పించిన సోనూసూద్‌ తాజాగా మహిళ కోసం ఏకంగా విమానంను బుక్‌ చేసి వారిని సొంత ప్రాంతం చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు.
ఈ సమయంలో సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ హీరో అయ్యాడు.ఆయన్ను పొగుడుతూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.తాజాగా ఒక లేడీ మాత్రం తన భర్తతో చాలా ఇబ్బందిగా ఉంది.లాక్‌డౌన్‌ కారణంగా ఆయన డ్యూటీకి వెళ్లడం లేదు.

 Sonu Sood Tweet Goa Viral Post

నేను బయటకు వెళ్లే పరిస్థితి లేదు.ఇద్దరం ఒకే ఇంట్లో చాలా రోజులు ఉండటం వల్ల పదే పదే గొడవలు వస్తున్నాయి.

అందుకే నన్ను మా అమ్మవాళ్ల ఇంటికి లేదంటే ఆయన్ను వాళ్ల ఇంటికి పంపించమంటూ సోనూసూద్‌కు విజ్ఞప్తి చేసింది.

భార్య భర్తల గొడవకు సోనూసూద్‌ ఇచ్చిన ఆన్‌లైన్‌ సలహా వైరల్‌-Movie-Telugu Tollywood Photo Image

ఆమె ట్వీట్‌కు స్పందించిన సోనూసూద్‌ చాలా ఫన్నీ సమాధానం ఇచ్చాడు.మీ ఇద్దరి గొడవ పోవాలంటూ గోవా పంపిస్తాను.దీనికి మీరు ఏమంటారు అంటారు అన్నాడు.

ఆయన స్పందనకు అంతా కూడా అవాక్కయ్యారు.సోనూసూద్‌ ట్వీట్‌తో ఆయనలోని కామెడీ యాంగిల్‌ కూడా ఉందని కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గోవా పంపిస్తాను అంటూ ట్వీట్‌ చేయడంతో తప్పకుండా వెళ్తాం అంటూ ఆమె సమాధానం ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonu Sood Tweet Goa Viral Post Related Telugu News,Photos/Pics,Images..

footer-test