బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ సోనూసూద్..!!

గత ఏడాది లాక్ డౌన్ సమయం నుండి సేవలు అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నది ఎక్కువగా నటుడు సోనుసూద్.లాక్ డౌన్ సమయం లో అనేక మంది వలస కార్మికులను ఆదుకున్న ఈ రియల్ హీరో.

 Sonu Sood Tested Covid Positive-TeluguStop.com

తన సొంత డబ్బులు చేత అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నారు.పేద విద్యార్థులకు చదువు అందిస్తూ, ఉద్యోగం లేని వారికి ఉపాధి కల్పిస్తున్న సోనూసూద్ తాజాగా కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, ఖచ్చితంగా జయించి మళ్లీ మీకు సేవలు అందిస్తాను అంటూ పోస్ట్ పెట్టారు.

 Sonu Sood Tested Covid Positive-బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ సోనూసూద్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫస్ట్ టైం సోనూసూద్ కరోనా బారిన పడటం.దీంతో ఎంతో మానవత్వం కలిగిన సోనుసూద్ కరోనా బారిన పడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

స్వల్ప లక్షణాలు ఉండటంతో వెంటనే సోనూసూద్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా. పాజిటివ్ రిపోర్ట్ రావటం జరిగింది.దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన నాటి నుండి చాలా మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.ఇండియాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నా, మరోపక్క లక్షల్లో కేసులు బయటపడటం ప్రభుత్వాలకు టెన్షన్ పుట్టిస్తోంది.

#Sonu Sood #Corona Virus #COVID Positive #Lockdown Time #SonuSood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు