సోనూసూద్‌ లవ్‌స్టోరీ గురించి మీకు తెలుసా..?

సోనూ సూద్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.కరోనా క్లిష్ట పరిస్థితులలో సహాయం కోరిన వారికి తనదైన శైలిలో సహాయం చేస్తూ ఎంతోమందిని ఆపదలో ఆదుకున్న ఒక రియల్ హీరో సోనుసూద్ అని చెప్పవచ్చు.

 Sonu Sood Sonali Interesting Love Story-TeluguStop.com

తెరపై విలన్ పాత్రలు పోషించినప్పటికీ తెరవెనుక మాత్రం ఒక హీరోగా తన స్వభావాన్ని బయటపెట్టాడు.మరి ఆపద సమయంలో ఎంతోమందిని ఆదుకున్న సోనుసూద్ నేడు (జూలై 30) పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ రియల్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

సాధారణంగా ఒకరికి సహాయం చేయాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి.ఈ క్రమంలోనే ఒక చేతితో కొడితే చప్పట్లు వినిపించవు అని చెబుతుంటారు.మరి సోనుసూద్ ఈ విధంగా కరోనా కష్టకాలంలో ప్రజలకు సహాయం చేయడం వెనక తన భార్య సోనాలి పాత్ర తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు.మరి పుట్టినరోజు సందర్భంగా సోనాలి, సోనుసూద్ లవ్ స్టోరీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Sonu Sood Sonali Interesting Love Story-సోనూసూద్‌ లవ్‌స్టోరీ గురించి మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bollywood, Corona, Love Marriage, Love Story, Movie, Real Hero, Sonali, Sonu Sood, Sonusood Love Story, Tollywood, Wife Sonali-Movie

సోను సూద్ ఇంజనీరింగ్ చదివే రోజులలో సోనాలి కూడా ఎంబీఏ చేస్తుంది.ఆ చదివే వీరిద్దరిని కలిపిందని చెప్పవచ్చు.చదువుకునే రోజులు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియజేస్తూ .పెద్దల ఆశీర్వాదంతో 1996 లో పెళ్లి పీటలు ఎక్కారు.పెళ్లి తర్వాత ఒక కంపెనీలో ఉద్యోగం చేయగా.

సోను సూద్ మోడలింగ్ వైపు వెళ్లారు.పెళ్లి తర్వాత ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఎవరి సహాయం కోరలేదు.

Telugu Bollywood, Corona, Love Marriage, Love Story, Movie, Real Hero, Sonali, Sonu Sood, Sonusood Love Story, Tollywood, Wife Sonali-Movie

ఈ క్రమంలోనే 1999లో సోను సూద్ నటనా రంగంలోకి అడుగు పెట్టారు.సోనూ సూద్ ఇండస్ట్రీలోకి రావడంతో మొదట్లో బాధపడిన సోనాలి అతడి అభిరుచిని అర్థం చేసుకుని తనకు ఎంతో ప్రోత్సహించింది.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు రియల్ హీరో అని ప్రశంసిస్తుంటే ఎంతో పొంగిపోతోంది.మరి భర్తకు కష్టాలలో చేదోడువాదోడుగా నిలిచి తనను ప్రోత్సహించిన సోనాలి మన తెలుగింటి ఆడపడుచు కావడం విశేషం.

#Love Marriage #Sonali #Wife Sonali #Corona #Sonu Sood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు