మంచిపని చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్ కొడుకు.. ఏం చేశాడంటే..?

గత కొన్ని నెలల నుంచి కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తూ వార్తల్లో నిలిచారు సోనూసూద్.సోనూసూద్ ద్వారా దేశంలో పదుల సంఖ్యలో ప్రజలు సాయం పొందారు.ఇప్పటికీ సోనూసూద్ ఎంతోమందికి సాయం చేస్తున్నారు.ఎవరైనా సోషల్ మీడియా వేదికగా కష్టాల్లో ఉన్నామని చెబితే ఎంక్వైరీ చేసి సోనూసూద్ తనవంతు సాయం చేస్తున్నారు.అయితే తాజాగా సోనూసూద్ కొడుకు కూడా ఒక మంచిపని చేసి వార్తల్లో నిలిచారు.

 Sonu Sood Son Adopts Abandoned Puppy-TeluguStop.com

వీధుల్లో ఒంటరిగా తిరుగుతున్న చిన్న కుక్కపిల్లను సోనూసూద్ తనయుడు దత్తత తీసుకున్నారు.

ఈ కుక్కపిల్లకు సోనూసూద్ కొడుకు నరుటో అని పేరు పెట్టారు.సోనూసూద్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.

 Sonu Sood Son Adopts Abandoned Puppy-మంచిపని చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్ కొడుకు.. ఏం చేశాడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొడుకు కుక్కపిల్లను ఎత్తుకున్న ఫోటోను సోనూసూద్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫోటోకు ఏకంగా 46,600 లైకులు రావడం గమనార్హం.

సోనూసూద్ కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకుంటుంటే సోనూసూద్ కొడుకు మూగజీవాలను ఆదుకుని వార్తల్లో నిలిచారు.సోనూసూద్ ఇప్పటివరకు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.సోసూసూద్ పేద ప్రజలకు సహాయం చేయడం కోసం ఆస్తులను కూడా తనఖా పెట్టినట్టు కొన్ని నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది.ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు సాయం చేస్తున్నారు.

యూపీ రాష్ట్రంలోని ఝాన్సీ పరిధిలో ఉన్న ఒక గ్రామానికి చెందిన ప్రజలు నీటిఎద్దడి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సోనూసూద్ గ్రామంలో చేతిపంపులను ఏర్పాటు చేశారు.భవిష్యత్తులో ఆ గ్రామానికి వచ్చి చేతిపంపు నీటిని కూడా తాగుతానని సోనూసూద్ అన్నారు.

తెలుగులో ఆచార్యతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్న సోనూసూద్ భవిష్యత్తులో సినిమాల్లో హీరోగా కూడా నటించే అవకాశాలు ఉన్నాయి.

#Sonusood #Corona #Viral #Social Media #Adopted

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు