సోనూసూద్ కు తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు విలన్ గా సుపరిచితమైన వాళ్లలో సోనూసూద్ ఒకరు.అయితే లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, పేద ప్రజలకు సహాయం చేసి సోనూసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజ జీవితంలో హీరోనని ప్రూవ్ చేసుకున్నాడు.

 Tollywood Villain Sonussood Reveals About First Movie Chance, Sonu Sood, Neha Dh-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ సినిమాల్లో నటించిన సోనూసూద్ అరుంధతి, దూకుడు, జులాయి సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వేలాది మందికి సహాయం చేసిన సోనూసూద్ గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం నెటిజన్లు సైతం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

కెరీర్ మొదట్లో చిన్నాచితకా పాత్రల్లో నటించిన సోనూసూద్ కు తొలి సినిమా ఛాన్స్ రావడం వెనుక ఆసక్తికరమైన కథే ఉంది. నేహా దూపియా నో ఫిల్ట‌ర్ విత్ నేహా చిట్ చాట్ లో సోనూ తన తొలి సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించాడు.

తనకు తమిళంలో తొలి అవకాశం వచ్చిందని ఆ విషయం తెలిసి అమ్మ తమిళం ఎలా నేర్చుకోవాలనే బుక్ ఇచ్చిందని చెప్పారు.

Telugu Arundathi, Dookudu, Hindhi, Julayi, Khallamjagar, Malayalam, Neha Dhupia,

అమ్మ ఇచ్చిన పుస్తకంలోని కొన్ని తమిళ పదాలను నేర్చుకొని స్టూడియోకు వెళ్లగా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చోమని సూచించాడని అనంతరం నిర్మాత, డైరెక్టర్ టీ షర్ట్ తీసి నీ బాడీ చూపిస్తావా.? అని అడిగారని చెప్పారు.తాను వెంటనే టీ షర్ట్ ను తీసివేయగా నిర్మాత, దర్శకుడు సినిమాలో సెలెక్ట్ అయినట్టు చెప్పారని తెలిపారు.

తొలి సినిమాకు ఎంపికైన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని ఆ విధంగా ఖ‌ల్లంజాగ‌ర్ చిత్రం ద్వారా 1999లో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టానని సోనూసూద్ ఇంటర్వ్యూలో చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube