సోనూసూద్ పేరు పద్మ అవార్డ్స్ లో మిస్ అవ్వడానికి రాజకీయమే కారణమా?

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సోనుసూద్ నిజజీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాల సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.కరోనా వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి సహాయసహకారాలు అందిస్తూ ప్రజలలో దేవుడిగా, కలియుగ కర్ణుడుగా పేరు సంపాదించుకున్న సోనుసూద్ కోసం ఎన్నో రాజకీయ పార్టీలు వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యాయి.

 Real Hero Sonusood Name Missing In Padma Awards Details,  Sonu Sood, Padma Award-TeluguStop.com

అయితే తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రానని తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని సోనుసూద్ తెలిపారు.ఇకపోతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలవారికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేసిన సోనుసూద్ పేరు అవార్డుల జాబితాలో లేకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు స్పందిస్తూ… సోను సూద్ అమ్ ఆద్మీకి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తన్న నేపథ్యంలో ఈయనకు పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా సోనూసూద్ కి పద్మ అవార్డు రాకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏకంగా 128 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింన సంగతి మనకు తెలిసిందే.

Real Hero Sonusood Name Missing In Padma Awards Details, Sonu Sood, Padma Awards, Missing, Bollywood, Republic Day, Politics, Sonusood Padma Award, Real Hero Sonusood, Aam Aadmi Party - Telugu @sonusoodarmy, Aam Aadmi, Bollywood, Padma Awards, Sonusood, Republic Day, Sonu Sood, Sonusoodpadma

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube