కంటతడి పెట్టిన సోనూసూద్.. కారణం అదే!  

దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వలస కూలీలకు, నిస్సహాయకులకు తన వంతు సాయంగా చేయూత అందించి ఎంతోమందిని ఆదుకొని రియల్ హీరో గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోనుసూద్ ఓ విషయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.సోనుసూద్ కంటతడి పెట్టడానికి కారణం ఏమిటంటే… కరోనా సమయంలో సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోను సూద్ ను కలవడానికి బీహార్ నుంచి ఆర్మాన్ అనే ఓ అభిమాని సైకిల్ తొక్కుతూ ఏకంగా ముంబైకి బయలుదేరిన సంగతి తెలిసిన సోనుసూద్ తనపై చూపుతున్న అభిమానానికి కొంత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు .

TeluguStop.com - Sonu Sood Moved To Tears By Bihar Fan Cycling To Meet Him In Mumbai

తనపై ఆ అభిమాని చూపిస్తున్న ప్రేమకు సోను సూద్ కంటతడి పెట్టుకుని అతడికి సహాయం చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మార్గమధ్యంలోనే అతడితో మాట్లాడించి అతను ముంబై చేరుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు.

అయితే తనతో పాటు తన సైకిల్ కూడా ప్రత్యేక విమానంలో తీసుకుని ముంబై కి వచ్చే ఏర్పాట్లను చేసిన సోను సూద్ తిరిగి ఆ సైకిల్ తో పాటు బీహార్ చేరుకోవడానికి అయ్యే ఖర్చు లన్నింటిని తానే భరిస్తున్నాడు.ఆర్మాన్ కు నేనంత ప్రత్యేకమైప్పుడు, తన రాకను నేను ఘనంగా స్వాగతించాలని సోను సూద్ తెలియజేశాడు.

TeluguStop.com - కంటతడి పెట్టిన సోనూసూద్.. కారణం అదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సోను సూద్ కు బీహార్ ప్రజలు ఒక్కసారి తమ రాష్ట్రానికి రావాలని కోరారు.అయితే అక్కడ ప్రజలను కలవడానికి కొంత సమయం పడుతుందని సోను సూద్ తెలియజేశారు.

ఇంతటి మంచి మనసును కలిగి ఉన్న సోనుసూద్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అనలిటికల్ సమస్త గత నెలకు సంబందించి, వ్యాపారం, క్రీడా, రాజకీయ, సినీరంగం అన్ని రంగాలలో టాప్ సెలబ్రిటీస్ ఎవరా అని చూడగా.

అందులోసోనూసూద్ నాలుగవ స్థానంలో ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం.

#Moved To Tears #Sonu Sood #ToMeet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonu Sood Moved To Tears By Bihar Fan Cycling To Meet Him In Mumbai Related Telugu News,Photos/Pics,Images..