సోనూసూద్ కి ఐక్యరాజ్యసమితి పురస్కారం

పది మందికి మంచి చేయాలని అనుకున్నప్పుడు చేసుకుంటూ పోవడమే అనే మాటని కొందరు తూచతప్పకుండా ఫాలో అవుతారు.అందుకే వారికి ఉన్నదాంట్లో, సంపాదించిన దాంట్లో కొంతైనా సమాజంలో ఉన్నవారికి ఉపయోగపడితే బాగుంటుంది అనుకుంటారు.

 Sonu Sood Honoured With Special Humanitarian Action Award, Bollywood, Indian Cin-TeluguStop.com

అందుకు తగ్గట్లుగానే సేవాకార్యక్రమాలు చేస్తూ ఉంటారు.కొందరు గుప్తదానాలు చేస్తూ ఉంటారు.

కొందరు మాత్రం అందరికి కనిపించేలా దానాలు చేసి తాము చేసిన పని మరికొంత మందికి అయినా స్ఫూర్తిగా నిలిచి వారు ఇలాంటి సమాజ సేవలో భాగం కావాలని కోరుకుంటారు.రెండో కోవకి చెందిన వ్యక్తి సోనూసూద్.

కరోనా లాక్ డౌన్ తర్వాత కష్టకాలంలో వలస కూలీలని వారి గమ్యస్థానాలకి చేర్చడంతో పాటు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని ఆడుకుంటూ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు.ఇప్పటికే అతను చేస్తున్న సేవకి ప్రజల నుంచి గుర్తింపు లభించింది.

అతన్ని ఒక రియల్ హీరోగా చూస్తున్నారు.

సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అతనికి అరుదైన పురస్కారం అందేలా చేశాయి.

ఐక్య‌రాజ్య స‌మితి అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ ఏడాది సోనూసూద్‌కి ఇవ్వ‌బోతోంది.లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు సోనూ చేసిన స‌హాయానికి గానూ ఈ గుర్తింపు ద‌క్కింది.

సోనూ చేసిన సేవకి లభించిన గొప్ప గౌరవంగా ఈ పురష్కారాన్ని చెప్పుకోవాలి.ఈ పురష్కారం రావడంతో మరో సారి సోనూసూద్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు.ఈ అవార్డు తీసుకోవడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ గుర్తింపుపై సోనూసూద్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు త‌న చేత‌నైనంత స‌హాయం చేశాన‌ని, తోటి వారిని ఆదుకోవ‌డం మ‌నిషిగా త‌న బాధ్య‌త అనుకున్నాన‌ని, అందుకే ఈ పుర‌స్కారం వ‌చ్చింద‌ని త‌న సంతోషాన్ని పంచుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube