కరోనా వైరస్ కు ముందు వరకు సోనూసూద్ అంటే సినిమాల్లో విలన్ గానే గుర్తొచ్చేవాడు.లేదంటే సిక్స్ ప్యాక్ హీరోగా గుర్తొచ్చేవాడు.
కానీ ఇప్పుడు దేవుడు రూపంలో కనిపిస్తున్నాడు.తన మంచితనం.
కాదు కాదు విలన్ రియాలిటీ కరోనా వైరస్ వస్తే గానీ బయటపడలేదు.సోనూసూద్ 20 ఏళ్లు సంపాదించిన పేరు ఒక లెక్క అయితే కరోనా వైరస్ 6 నెలల్లో సంపాదించనది ఒక లెక్క.
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఆర్ధికంగా నష్టపోయి ఎటు వెళ్లాలో తెలియక రోడ్దు పట్టుకొని వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడిలా వచ్చి సాయం అందించాడు.మొదట్లో ఎంతమందికిలే అని కొట్టిపారేస్తే ఇప్పుడు ఆయన చేసిన సాయం లెక్కపెట్టలేం.
ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ సాయం చేయడానికి నేను ఉన్న అంటూ సాయం చేస్తున్నాడు.
ఇక అలానే ఇప్పుడు కూడా అతడి గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు.
తెలంగాణ బాలుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల రూపాయిలు సాయం అందించాడు సోనూసూద్.పూర్తి వివరాల్లోకి వెళ్తే… తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
వైద్య ఖర్చుల కోసం ఆయన ముందుకొచ్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల రూపాయిలు ఆర్ధిక సాయం చేశాడు.
కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆ బాలుడికి ఆర్ధికంగా సాయం చేసి గుండె ధైర్యాన్ని నింపారు.
ఇలా ఎన్నో ఎన్నో మంచి పనులు చేస్తూ భారత ప్రజల మనసు దోచేస్తున్నారు సోనూసూద్. గతంలోనూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ సాయం చేశారు.
సినిమాల్లో నటించడం కంటే కూడా ఇలా సాయం చెయ్యడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందనుకున్నారో ఏమో సాయం చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు.సోనూసూద్ అంటే ఇప్పుడు రీల్ కాదు రియల్ హీరో.