కొడుకుకు ఖరీదైన బహుమతి ఇచ్చిన సోనూసూద్.. రూ.2.5 కోట్లతో..?

రియల్ హీరో సోనూసూద్ గడిచిన 16 నెలలుగా పేద ప్రజల కోసం చేస్తున్న సేవలు అన్నీఇన్నీ కావు.ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెబితే సోనూసూద్ వెంటనే స్పందించడంతో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటారు.

 Sonu Sood Gift Mercedes Maybach Gls 600 To His Son Ishant Sood For Fathers Day-TeluguStop.com

ఏ సంబంధం లేని ప్రజలకే భారీగా సాయం చేస్తున్న సోనూసూద్ తాజాగా కొడుకుకు ఖరీదైన బహుమతిని ఇచ్చారు.ఈ నెల 20వ తేదీన వరల్డ్ ఫాదర్స్ డే అనే సంగతి తెలిసిందే.

వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా సోనూసూద్ తన కొడుకుకు ఖరీదైన బహుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

 Sonu Sood Gift Mercedes Maybach Gls 600 To His Son Ishant Sood For Fathers Day-కొడుకుకు ఖరీదైన బహుమతి ఇచ్చిన సోనూసూద్.. రూ.2.5 కోట్లతో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొడుకుకు సోనూసూద్ బహుమతిగా ఇచ్చారు.

సోనూసూద్ కొడుకు ఇషాంత్ సూద్ కు ఇచ్చిన కారు గత వారమే మార్కెట్ లోకి వచ్చిన మోడల్ కారు కావడం గమనార్హం.కుమారుడికి ఇవ్వడానికి సోనూసూద్ ఇంటికి కొత్త కారును తీసుకొచ్చిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

సోనూసూద్ కొనుగోలు చేసిన ఈ కారు బ్లాక్ కలర్ లో ఆకర్షణీయంగా ఉంది.

Telugu 2.5 Crores Car Gift, Aachary Movie, Fathers Day, Ishant Sood, Mercedes Maybach Gls600, Sonusood, Sonusood Fathers Day Gift, Sonusood Son-Movie

సోనూసూద్ తన కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ కారులో ట్రయల్ రన్ కు వెళ్లారు.సోనూసూద్ కొనుగోలు చేసిన ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.కారును స్టార్ట్ చేసిన్ 5 సెకన్లలోనే ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.

ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ కారును తండ్రి బహుమతిగా ఇవ్వడంతో ఇషాంత్ సూద్ చాలా సంతోషించారని తెలుస్తోంది.

Telugu 2.5 Crores Car Gift, Aachary Movie, Fathers Day, Ishant Sood, Mercedes Maybach Gls600, Sonusood, Sonusood Fathers Day Gift, Sonusood Son-Movie

సోనూసూద్ కార్లను ఎంతో ఇష్టపడతారు.సోనూసూద్ దగ్గర ఖరీదైన వాహనాలు ఎన్నో ఉన్నాయి.ఈ ఏడాది సోనూసూద్ కీలక పాత్రలో నటించిన అల్లుడు అదుర్స్ రిలీజ్ కాగా తెలుగులో ఆచార్య సినిమాతో పాటు పలు సినిమాల్లో సోనూసూద్ నటిస్తున్నారని తెలుస్తోంది.

#SonusoodFathers #Fathers Day #2.5Crores #MercedesMaybach #Sonusood Son

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు