సోనూ సూద్ ప్రజలనుంచీ సేకరించిన విరాళాలు ఖర్చు పెట్టలేదట...

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపుగా 100కి పైగా చిత్రాలలో విలన్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ మరియు నటుడు “సోనూ సూద్” గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పటివరకు అందరికీ సోనూ సూద్ కేవలం నటుడిగా మాత్రమే తెలుసు.

 Sonu Sood Funds Misusing New Viral-TeluguStop.com

కానీ కరోనా విపత్కర సమయంలో ఎంతో మందిని తన సొంత డబ్బు వెచ్చించి తమ స్వస్థలాలకు పంపించాడు.అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో చాలా మంది నిరుపేదలు తిండి, తిప్పలు లేక గడుపుతుండటంతో సోను సూద్ స్వయంగా చాలా మందికి నిత్యవసర సరుకులు మరియు చదువుకునేటువంటి విద్యార్థులకు తనకు సహాయం అందించాడు.

దీంతో సోనూసూద్ అందరికీ దేవుడిలా కనిపించాడు.

 Sonu Sood Funds Misusing New Viral-సోనూ సూద్ ప్రజలనుంచీ సేకరించిన విరాళాలు ఖర్చు పెట్టలేదట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా సోనూసూద్ ఇంటి పై కొందరు ఇన్ కమ్ టాక్స్ అధికారులు రైడ్ జరిపి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మరియు విదేశాల నుంచి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సేకరించారని అయితే ఇందులో కేవలం 1.81 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడని మిగిలిన 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు దాఖలాలు లేవని ఐటీ అధికారులు పేర్కొన్నారు.అంతేకాకుండా సోనూ సూద్ గతంలో కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను ని దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా పన్ను కట్టకుండా ఎగ్గొట్టారని తెలియజేశారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ సినీ టౌన్ లో చర్చనీయాంశం అయింది.

అంతేకాకుండా కొందరు సోషలిస్టులు మరియు ప్రజా సంఘ నాయకులు ఈ విషయంపై స్పందిస్తూ సోనూ సూద్ అంటే గిట్టని వాళ్లు సోనూ సూద్ కి సంబంధం లేనటువంటి కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని కాబట్టి అతడికి ప్రొటెక్షన్ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.

Telugu Funds Misusing, Income Tax, Sonu Sood, Sonu Sood Funds Misusing New Viral, Telugu Villain, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనూ సూద్ తెలుగులో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు “కొరటాల శివ” దర్శకత్వం వహిస్తుండగా ప్రకాష్ రాజ్, కాజల్ అగర్వాల్, జగపతి బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Funds #Tax #Sonu Sood Funds #Sonu Sood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు