ఖమ్మం జిల్లా లో ఆపద్భాందవుడు సోనుసూద్ విగ్రహాని ఏర్పాటు చేసిన అభిమాని

సినీ యాక్టర్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు.ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో రియల్ స్టార్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు.

 Sonu Sood  Fan Who Set Up Sonusood Statue In Khammam District, Sonu Sood  Fan ,-TeluguStop.com

వెంకటేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నపటికీ సోనుసూద్ మీద ఉన్న ఎనలేని ప్రేమ అభిమానంతో విగ్రహాన్ని విజయవాడ దగ్గరలో గల గొల్లపూడి లో విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ నుండి ఆటో లో విగ్రహాన్ని తన సొంత గ్రామానికి తీసుకువచ్చారు.వెంకటేష్ కు వచ్చిన మంచి ఆలోచన కి గ్రామస్తులు అందరూ అతనిని అభినందించారు.

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు చేయలేని చాలా మంచి పనులు సోనూసూద్ చేసి చూపించిన మంచి కార్యక్రమాలు నిరుపేదలకు సాయం అందించడంలో గాని ,దూరప్రాంతాలకు వెళ్లే వారికి తన సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి బస్సులో తరలించడం నిరుపేదలకు అండగా ఉండడం వంటి పలు కార్యక్రమాలు చేయడంలో సోనుసూద్ కు సాటి ఎవరు ఉండరు అని భావించి ఆయనను కంటికి కనపడే దేవుడిగా భావించిన వెంకటేష్ విగ్రహ ఏర్పాటుకు రూపకల్పన దాల్చాడు.

Telugu @sonusoodarmy, Corona, Gorlapadu, Khammam, Sonusood, Sonu Sood Fan, Sonus

సోనూసూద్ మనిషి రూపంలో వచ్చిన దేవుడిగా భావించి సోను సూద్ మీద ఉన్న ప్రేమ అభిమానాలతో తన ఊర్లో ఆ దేవుని విగ్రహం ఉండాలని ఏర్పాటు చేస్తున్నాడు‌.సోనుసూద్ విగ్రహం ఆవిష్కరణ కు తన దేవుడు అయిన సోనుసూద్ రావాలని ప్రయత్నిస్తాను అని వెంకటేష్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube