నిర్మాతలకు విలన్‌గా మారిన లాక్‌డౌన్ హీరో  

Sonu Sood Demands Huge Remuneration, Sonu Sood, Remuneration, Lock down, Balakrishna, Boyapati Sreenu - Telugu Balakrishna, Boyapati Sreenu, Lock Down, Remuneration, Sonu Sood, Sonu Sood Demands Huge Remuneration

సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు సోనూ సూద్ పేరు ఇటీవల దేశవ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్‌ను యావత్ దేశవ్యాప్తంగా పొగడ్తలతో ముంచెత్తారు.

TeluguStop.com - Sonu Sood Demands Huge Remuneration

అయితే ఇప్పుడు సోనూ సూద్ కొందరి పాలిట విలన్‌గా మారాడని, అతడిని చూసి వారు నెత్తిపట్టుకుంటున్నారు.ఇంతకీ సోనూ సూద్ ఎవరి పాలిట విలన్‌గా మారాడా అని అనుకుంటున్నారా?

ప్రస్తుతం సోనూ సూద్ నటిస్తున్న చిత్రాలకు ఆయన తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో సోనూ సూద్‌ను విలన్ పాత్రకు ఎంపిక చేశారు.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో, ఇందులో సోనూ సూద్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

TeluguStop.com - నిర్మాతలకు విలన్‌గా మారిన లాక్‌డౌన్ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే తొలుత ఈ పాత్రకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో సోనూ సూద్‌ను ఎంపిక చేశారు.

ఈ సినిమాలో బాలయ్యను సోనూ సూద్ ఢీకొట్టే విధానం అదిరిపోతుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో సోనూ సూద్ చాలా వైవిధ్యంగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఈ సినిమా కోసం సోనూ సూద్ ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.ఇక యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రంలో కూడా సోనూ సూద్ నటిస్తుండటంతో ఆ సినిమా కోసం కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా సోనూ సూద్ తన రెమ్యునరేషన్ పెంచేయడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

కాగా ఉన్నవాళ్ల దగ్గర తీసుకున్న డబ్బును పేదలకు పంచుతున్న సోనూ సూద్ ప్రస్తుతం రాబిన్ హుడ్‌గా మారాడని ఆయన అభిమానులు అంటున్నారు.

#Balakrishna #Boyapati Sreenu #Lock Down #Remuneration #Sonu Sood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonu Sood Demands Huge Remuneration Related Telugu News,Photos/Pics,Images..