ఆ బామ్మా ''ఆకలి'' విన్యాసం చూసి సోనూసూద్ కీలక నిర్ణయం!

ముందే కరోనా సమయం… వృద్ధులు అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదముంది.

 Sonu Sood, Crucial Decision, Grandma, Hunger-TeluguStop.com

అందుకే వృద్ధులందరు ఇంటిపట్టునే ఉంటూ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.కానీ ఇక్కడ ఒక వృద్ధురాలు మాత్రం బయటకు వెళ్లి కర్రసాము చేస్తోంది.

ఏదో టైం పాస్ కాదు… 75 ఏళ్ళ వయసులో పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కోసం ఆ వృద్ధురాలు కర్రసాము చేస్తుంది .ఈ వృద్ధురాలి కర్రసాము చూస్తే.నోరెళ్లబెట్టాల్సిందే.

ఆ వృద్ధురాలి ఆకలి ఆమె ధైర్యం ఆమె విన్యాసం అన్ని సోషల్ మీడియాలో ఎంతోమంది మనసులను కలచివేస్తోన్నాయి.

కుటుంబ పోషణ భారం కావడంతో తనకు తెలిసిన కర్రసాము ని ఉపాధిగా మార్చుకుని రోడ్డుపైన కర్రసాము చేస్తూ సాయం చేయండి అంటూ అర్థిస్తుంది ఆ వృద్ధురాలు.ప్రస్తుతం ఈ భామ కర్ర సాము చేస్తున్న వీడియో నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోయింది.

ఇక ఈ భామ ఆకలి కోసం చేస్తున్న విన్యాసం ఎంతో మందిని కదిలించింది.బాలీవుడ్ నటుడు సోనుసూద్… సహా మరికొంతమంది ఈ భామకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

దయచేసి ఈ భామకు సంబంధించిన వివరాలు ఇవ్వగలరు అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు సోను సూద్.వృద్ధురాలి ద్వారా మహిళలకు ఆత్మ రక్షణలో శిక్షణ ఇప్పిస్తామంటూ సోనుసూద్ వ్యాఖ్యానించారు.

ఏదేమైనా ఆ వృద్ధురాలు ఆకలి కోసం చేస్తున్న విన్యాసం మాత్రం ఎంతో మందిని కలిచి వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube