అమ్మ మాటలతో సినిమాల్లోకి వచ్చా.. కానీ సంతృప్తినిచ్చింది మాత్రం సాయం: సోనూసూద్

కలియుగ కర్ణుడు గా సోనూసూద్ ప్రజల గుండెల్లో నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.గత ఏడాది నుంచి కష్టకాలంలో సోనూ సూద్ చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు ఉంటుంది.

 Actor Sonu Sood Comments On Corona Virus Lockdown Help, Actor Sonu Sood, Bollyw-TeluguStop.com

ఎందుకంటే ఆయన చేసిన సహాయం ఇంతవరకు ఇంకెవరూ చేయలేరు.ఆయన కరోనా సమయంలో ఎంతోమంది జీవితాలను నిలబెట్టాడు.

ఎంతోమందికి నేనున్నా అని ధైర్యం ఇచ్చాడు.

సినీ పరిశ్రమలో సోనూ సూద్ ఎన్నో సినిమాలలో నటించాడు.

ఆయన ఎక్కువగా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు.చాలా వరకు నెగెటివ్ రోల్ లో తన పాత్ర అందరికీ కోపం తెచ్చేలా ఉంటుంది కానీ నిజ జీవితంలో ఆయన పాత్ర చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది.

సినిమాల్లో విలన్ గా ఉన్న సోనూసూద్.నిజ జీవితంలో ఎంతోమంది గుండెల్లో హీరో గా మారాడు.

అంతేకాకుండా ఈయన చేసిన సేవకు ఓ గ్రామంలో ఏకంగా గుడి కట్టారు.

Telugu Sonu Sood, Bollywood, Corona Lockdown, Coronavirus, Jobs, Mother, Buses-M

ఇదిలా ఉంటే తాజాగా సోనూ సూద్ బుధవారం కొన్ని విషయాల గురించి తెలిపాడు.కరోనా సమయంలో వలస కార్మికులు పడిన కష్టాలను చూసి తను చలించానని తెలిపాడు.అవన్నీ చూసి తట్టుకోలేక వారికి సహాయం చేయాలనిపించిందట.

వారికోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలిపాడు.కొంత మంది కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయి ఉంటే వారికి తనకు తెలిసిన ఒక కార్పొరేట్ సంస్థలలో మాట్లాడి దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగాన్ని అందించినట్లు తెలిపారు.

ఇక ఒకప్పుడు తన అమ్మ చెప్పిన మాటలు గురించి కొన్ని విషయాలు తెలిపాడు.

వాళ్ళ అమ్మ తను ఒకరికి సహాయం చేస్తే వారి నుంచి వచ్చే దీవెనలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని తెలిపిన తన అమ్మ మాటలను అభిమానులతో పంచుకున్నాడు.

తను వాళ్ళ అమ్మ మాటల తో సేవ చేయాలని అనిపించినట్లు తెలిపాడు.ఇక అరుంధతి, గబ్బర్ సింగ్ సినిమాలలో తనకు మంచి పేరు వచ్చిందని తెలుపగా, అసలు సంతృప్తి కరోనా సమయంలో చేసిన సేవతోనే వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube