థర్డ్ వేవ్ పై కామెంట్స్ చేసిన సోనూ సూద్..ఇలా చేయండంటూ..!

సోనూ సూద్. పేరు ఈ మధ్య కాలంలో బాగా వినపడింది.

 Real Hero Sonu Sood Comments On Corona Third Wave, Sonu Sood, Corona Third Wave,-TeluguStop.com

కరోనా తర్వాత అనూహ్యంగా సోనూ సూద్ వార్తల్లోకి ఎక్కాడు.ఈయన చాలా సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని అనిపించు కున్నాడు.

కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఎంతో మందికి తన చేతనైన సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

కరోనా సమయంలో వలస కార్మికులకు ఆయన తన సొంత డబ్బులను ఉపయోగించి వారి ఇళ్లకు చేర్చడానికి బస్సులు, కార్లు, విమానాలు ఏర్పాటు చేసి వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చి రియల్ హీరో అయ్యాడు.ఆ తర్వాత కూడా తన దృష్టికి వస్తున్న సమస్యలపై స్పందించడమే కాకుండా సహాయం చేస్తూ అందరిని సహాయం చేయమని అడుగుతున్నాడు.

ఎప్పుడు ఎదో ఒక సహాయం చేసి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

తాజాగా కరోనా థర్డ్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు చేసి మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు సోనూ సూద్.

కరోనా తర్వాత దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికి తెలిసిందే.తినడానికి తిండి లేక.పనిచేయడానికి ఉపాధి అవకాశాలు లేక దేశంలో నిరుద్యోగులు రోజురోజుకూ పెరుగుతున్నారు.కరోనా వల్ల ఉద్యోగాలు ఉన్న వారు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

Telugu Corona Wave, Poor, India Corona, Sonu Sood, Sonusoodcorona-Movie

అయితే ఈ మధ్య సోనూ సూద్ ను ఒక వ్యక్తి కరోనా థర్డ్ వేవ్ పై మీరు ఎలా అనుకుంటున్నారు.థర్డ్ వేవ్ వస్తుందని మీరు కూడా భావిస్తున్నారా అని అడిగాడట.ఆ విషయాంపై ఇప్పుడు సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మనం ప్రెసెంట్ థర్డ్ వేవ్ ను అనుభవిస్తున్నామని ఆయన అన్నారు.

Telugu Corona Wave, Poor, India Corona, Sonu Sood, Sonusoodcorona-Movie

పేదరికం, నిరుద్యోగం కంటే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ కాదు అని ఆయన కామెంట్స్ చేసారు.ఇది పోవాలంటే అందరు ముందుకు వచ్చి నిరు పేదలకు సహాయం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ ఆయన తెలిపారు.ప్రెసెంట్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube