తాను రాస్తున్న పుస్తకం పేరు అనౌన్స్ చేసిన సోనుసూద్..!

కరోనా మహమ్మారి విజృంభన సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ వలస కార్మికులు పనులు లేక జీవనోపాధి కొనసాగించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వీరందరినీ చూసి మనసు చెలించి భారతదేశ చలనచిత్ర రంగాలలో విలన్ పాత్రలు పోషించే సోనుసూద్ రియల్ లైఫ్ లో అసలైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

 Soun Sood, Lock Down, Book, Iam No Messiah Book, Clarity, Carona Virus, Helping-TeluguStop.com

ఈయనఇదివరకే తాను కరోనా సమయంలో వలస కార్మికులకు సహాయం చేసిన సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ పుస్తకం రాస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి మన అందరికీ గుర్తు ఉండి ఉంటుంది.అయితే ఆ పుస్తకానికి సంబంధించి ఎలాంటి పూర్తి వివరాలను ఆయన తెలపలేదు.

తాజాగా సోనూసూద్ తాను రాయబోయే పుస్తకానికి ఓ పేరును పెట్టాడు.ఐ యామ్ నో మెస్సియా అనే టైటిల్ ను పుస్తకానికి నామకరణం చేశాడు.ఇంగ్లీష్ లో పెట్టిన పుస్తకం పేరు తెలుగులో దాని అర్థం.తానేమీ దైవదూతను కాదు అని పెట్టాడు.

ఈ పుస్తకంలో తాను వందలాది మందికి సహాయం అందించిన అప్పుడు తాను ఎదుర్కొన్న మానసిక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వాటిని పుస్తక రూపంలో తెలియజేస్తున్నట్లు తెలిపాడు.

Telugu Carona, Iam Messiah, Lock, Soun Sood-Latest News - Telugu

ప్రజలు తమ నేతను ప్రేమపూర్వకంగా నాకు మెస్సియా అని పేరు పెట్టారని కాకపోతే, తను మెస్సియా కాదని నేను నిజంగా ఆ విషయంలో క్లారిటీ గా ఉన్నానని సోను తెలిపారు.తన మనస్సు తనకి ఏ విధంగా చెబితే ఆలా చేశానని, మనమందరం మనుషులం ఒకరికి ఒకరు సహాయపడటం మన బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు.ఈ పుస్తకానికి మీనా అయ్యర్ సహా రచనగా సహాయం అందిస్తున్నారు.

ఈ పుస్తకానికి సంబంధించి వచ్చే నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉంది.వీటితో పాటు కష్ట సమయంలో వలసదారులకు సహాయం అందించడంలో తనను దేవుడు వాడుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఇది వరకు తాను ముంబై నగరంలో నివసించేవాడిని కాకపోతే ఈ సహాయాలు చేసిన తర్వాత తాను బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం ఇంకా ఇతర రాష్ట్రాల గ్రామాలలో నివసించడానికి ఇష్టపడుతున్నట్లు ఆయన తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube