సోనూసూద్ దాతృత్వం.. ఇకపై ఉచితంగా అలాంటి సర్జరీలు!

Sonu Sood Announced Free Ent Surgeries By His Sood Charity Foundation

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవలు చేసి రియల్ హీరో అనిపించుకున్న సోను సూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సోనుసూద్ ఇకపై ఉచితంగా చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ ద్వారా అందిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు.

 Sonu Sood Announced Free Ent Surgeries By His Sood Charity Foundation-TeluguStop.com

ఈ విషయంపై సోనుసూద్ స్పందిస్తూ ఉచితంగా ENT సర్జరీలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది.ఇకపై శబ్దం, రుచి, వాసనలను ఎంతో చక్కగా ఆస్వాదిద్దాం అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.ఇలా ఉచితంగా సర్జరీలను చేయించుకోవాలనుకొనేవారు ముందుగా soodcharityfoundation.org లోలాగిన్ అయిన తరువాత మీ వివరాలను నమోదు చేసి మీరు ఏ విధమైనటువంటి సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారు, మీ సమస్య ఏంటి అనే వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలి.

 Sonu Sood Announced Free Ent Surgeries By His Sood Charity Foundation-సోనూసూద్ దాతృత్వం.. ఇకపై ఉచితంగా అలాంటి సర్జరీలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Charity, Soonu Sood, Tollywood-Movie

ఈ విధంగా ఎంతో మందికి ఉచిత సర్జరీల ద్వారా మరింత సేవలు చేయాలన్న ఉద్దేశంతో చారిటీ ఫౌండేషన్ ద్వారా ఈ సర్జరీలను నిర్వహించడంతో మరోసారి ఎంతోమంది హృదయాలలో రియల్ హీరోగా చోటు సంపాదించుకున్నారు.కేవలం ఆపదలో ఉన్న వారికి మాత్రమే కాకుండా ఐఏఎస్‌ కొచింగ్‌, సీఏ, లా చదువుకొనే వారికి కూడా సోను సూద్ అండగా నిలబడి సహాయ సహకారాలను అందిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా ఉచిత సర్జరీలు చేయించడంతో సోనూసూద్ పై మరోసారి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Charity #Soonu Sood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube