రూ.కోట్లు పంచినా పట్టించుకోని కసాయి కొడుకులు  

koheda, Sons,father, police - Telugu Father, Koheda, Police, Sons

కన్న కొడుకులే కసాయిలుగా మారారు.వృద్ధాప్యంలో ఎవరో ఒకరు అండగా ఉంటారని భావించిన ఆయనకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.రూ.కోట్లల్లో ఆస్తి సంపాదించి ముగ్గురు కొడుకులకు చేరో కోటి రూపాయల చొప్పున ఆస్తి పంచిపెట్టాడు. చివరికి వృద్ధాప్యంలో అనారోగ్యానికి గురైన తండ్రిని పట్టించుకోవడానికి ముందుకు రాలేదు.గ్రామపెద్దలు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు.

 Sons Of Butchers Who Did Not Care To Distribute Crores Of Rupees

చివరకు ఆ తండ్రి ఆరోగ్యం క్షీణించినా.చూడటానికి ముందుకు రాలేదు.

దీంతో పోలీసులు ఆ కసాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రూ.కోట్లు పంచినా పట్టించుకోని కసాయి కొడుకులు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషాద ఘటన కోహెడ మండలం శనిగరం పరిధిలో చోటు చేసుకుంది.

శంకర్ నగర్ కు చెందిన పోతు మల్లయ్య (79) కు రవీందర్, జనార్దన్, రవీందర్ అనే ముగ్గురు కొడుకులున్నారు.కొడుకులు పెద్దవాళ్లు అయ్యేసరికి మల్లయ్య గతేడాది ఆస్తి పంపకం చేశారు.

ఒక్కో కొడుకుకి రూ.కోటి వరకు అందించాడు.కానీ ఆయనను ఏ కొడుకు పోషిండానికి ముందుకు రాలేదు.

పోలీసులకు, గ్రామ పెద్దలకు, హుస్నాబాద్ ఆర్డీఓకు తెలిపినా వారిలో మార్పు రాలేదు.

కౌన్సిలింగ్ సైతం ఇప్పించారు.మార్పు రాకపోవడంతో మల్లయ్యను పోలీసులు అంకిరెడ్డిపల్లిలోని ఓ వృద్ధాశ్రయంలో జాయిన్ చేశారు.

కొద్దిరోజులుగా మల్లయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు.ఈ సమాచారాన్ని ముగ్గురు కొడుకులకు అందించినా వారు పట్టించుకోలేదు.

దీంతో శనిగరం వీఆర్ఓ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు కొడుకులను అరెస్ట్ చేశారు.

#Father #Police #Sons #Koheda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sons Of Butchers Who Did Not Care To Distribute Crores Of Rupees Related Telugu News,Photos/Pics,Images..