దారుణం: కరోనా వచ్చిందని తల్లిని మండుటెండలో బావి దగ్గర వదిలేశారు!

కరోనాకు ముందు ఎక్కడో ఒకరో ఇద్దరో మానవత్వం లేకుండా ప్రవర్తించే వారిని చూశాం.కానీ కరోనా వచ్చాక తెలిసింది.

 Sons Left Corona Infected Mother Outside, Warangal, Corona Positive, Mother, Hom-TeluguStop.com

కొంతమందికి మాత్రమే మానవత్వం ఉందని.ఈ కరోనా కారణంగా పక్క వారిని కాదు ఇంట్లో వారిని కూడా దూరం పెడుతున్నారు అంటే నమ్మండి.

ఎంతోమంది ఇలానే కరోనా రాగానే ఇంట్లో వారిని సైతం బయట వదిలేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వచ్చిందని సొంత కన్నతల్లిని మండుటెండలో బావి దగ్గర వదిలేశారు.

ఇక ఈ దారుణ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చోటుచేసుకుంది.మారబోయిన లచ్చమ్మ అనే 82 ఏళ్ల వృద్ధురాలుకు కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో కన్నకొడుకులు తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేశారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వ్యవసాయ బావి వద్దకు చేరిన పోలీసులను చూసిన వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంది.కన్నకొడుకులు ఇలా చేయడంపై ఆమె కన్నీళ్లుపెట్టుకుంది.

ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు చెప్తుంది.పోలీసుల సాయంతో స్థానికులు వృద్ధురాలిని చిన్న కొడుకు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచారు.

ఈ సంవత్సరంలో ఇలాంటి దారుణ ఘటనలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube