అమెరికా రిటైల్ దిగ్గజానికి సీఈవోగా భారత సంతతి మహిళ  

Sonia Syngal Is The New Ceo Of Americas Largest Apparel Retailer Gap Inc - Telugu Ceo Of America\\'s Largest Apparel Retailer Gap Inc, Indian-american Sonia Syngal Is The New Ceo Of America\\'s Largest Apparel Retailer Gap Inc, Retailer Gap Inc, Sonia Syngal

అమెరికాలోని దిగ్గజ కంపెనీలకు పలువురు భారతీయులు రథసారథులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా మరో భారతీయ- అమెరికన్ సోనియా సింగాల్ అమెరికాలో అతిపెద్ద క్లాత్ రిటైలర్ సంస్థ జీఏపీకి కొత్త సీఈవోగా నియమితులయ్యారు.శ్వేతజాతి పురుషుల ఆధిపత్యం వున్న ఈ రంగంలో సోనియా నియామకం మారుతున్న పని సంస్కృతిని సూచిస్తుందని పలువురు నిపుణులు అంటున్నారు.

 Sonia Syngal Is The New Ceo Of Americas Largest Apparel Retailer Gap Inc

2018లో ఇంద్రా నూయి పెప్సికో చీఫ్‌ పదవి నుంచి వైదొలగిన తర్వాత ఫార్చ్యూన్ – 500 కంపెనీకి సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఏకైన భారతీయ అమెరికన్ మహిళ సోనియానే.జీఏపీ సంస్థ ఫార్చ్యూన్ -500 కంపెనీల జాబితాలో 186వ స్థానంలో ఉంది.49 ఏళ్ల సింగాల్ 2004లో జీఏపీలో చేరడానికి ముందు అనేక ఫార్చ్యూన్- 500 కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.వీటిలో మైక్రో సిస్టమ్స్, ఫోర్డ్ మోటార్ కంపెనీలు ఉన్నాయి.యూరప్‌లో జీఏపీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

మొత్తం మీద ఫార్చ్యూన్ – 500 కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న మహిళల సంఖ్య 33కు చేరినప్పటికీ, వీరిలో 6 శాతం మాత్రమే మహిళా సీఈవోలు.వీరిలో జనరల్ మోటర్స్ సీఈవో మేరీ బార్రా అగ్రస్థానంలో నిలిచారు.ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఐబీఎం చీఫ్ గిన్ని రోమెట్టి కొద్దిరోజుల క్రితం తన బాధ్యతల నుంచి తప్పుకుని ఇండో అమెరికాన్ అరవింద్ కృష్ణకు పగ్గాలు అప్పగించారు.
అమెరికాకు వలస వచ్చిన మహిళలు సీఈవో స్థాయికి చేరిన ఘటనలు కూడా అరుదే.

అమెరికా రిటైల్ దిగ్గజానికి సీఈవోగా భారత సంతతి మహిళ-Telugu NRI-Telugu Tollywood Photo Image

అడోబ్, వీవర్క్, మాస్టర్ కార్డ్, మైక్రాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ కంపెనీలకు భారతీయ సంతతికి చెందిన రెండు డజన్ల మంది సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు.ఏడాదికి 5 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే ఈ కంపెనీలకు సీఈవోలుగా ఉన్న వారిలో పురుషులే ఎక్కువ.

తాజాగా సోనియా సింగాల్ నియామకం ద్వారా తోటి మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకంగా మారతారు.స్త్రీ, పురుషుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ మార్పుల నుంచి ప్రపంచం ప్రేరణ పొందాల్సిన సమయం ఆసన్నమైంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test