సోనియాకు తగ్గని కోపం

ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇంకా కోపం తగ్గలేదు.ఆమెకు ఆయన మీద ఎందుకు కోపం? ప్రధాని అయ్యాడనా? ప్రధాని అయినందుకు ఆమెకు కోపం లేదు.ప్రధాని హోదాలో ఉండి, విదేశాల్లో యూపీఏ పరిపాలన గురించి ‘చీప్‌’గా మాట్లాడుతున్నందుకు ఇంకా మండిపడుతూనే ఉన్నారు సోనియా.యూపీఏ రెండు ప్రభుత్వాలకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అయినా పరోక్ష ప్రధాని సోనియా గాంధీయే కదా.ఆమె చెప్పినట్లే ఆయన నడుచుకునేవారు.అందుకే ప్రధాని విదేశాల్లో యూపీఏ పాలనను విమర్శించినా మన్మోహన్‌ కోపం తెచ్చుకోవడంలేదు.

 Sonia Slams Modi-TeluguStop.com

సోనియా మండిపడుతున్నారు.మోదీ వ్యవహార శైలి ‘పిల్లచేష్ట’మాదిరిగా ఉందని తన పార్టీ ఎంపీలతో జరిపిన వారాంతపు సమావేశంలో చెప్పారు.

కాంగ్రెసు పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడాలని, మనకు గొప్ప రికార్డు ఉందని అన్నారు.మన సిద్ధాంతాలు, కార్యక్రమాలు, విధానాల కోసం ఆత్మవిశ్వాసంతో పోరాడాలన్నారు.

ప్రధాని గత నెలలో కెనడాకువెళ్లినప్పుడు తన లక్ష్యం కుంభకోణాల భారత్‌ను నైపుణ్యంగల భారత్‌గా మార్చడమేనని అన్నారు.గత పాలకులు (యూపీఏ) ఇండియాను చెత్త చెత్త చేశారని, దాన్ని పరిశుభ్రం చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

దీంతో సోనియా గాంధీకి తీవ్ర ఆగ్రహం కలిగింది.మోదీ విదేశాల్లో భారత్‌ పరువు తీశారని దుయ్యబట్టారు.

ఆ కోపమే కొనసాగుతోంది.ఉన్న మాటంటే ఉలుకెందుకు? మోదీ చెప్పడానికి ముందే మన కుంభకోణాలు విదేశీయులకు తెలుసు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube