సోనియా ప్రకటనతో ఇరకాటంలో జగన్..??

జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నాడా.?? భవిష్యత్తులో జగన్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే పరిస్థితి వచ్చిందా.?? మాట ఇస్తే తప్పం.మడమ తిప్పం అనే రాజశేఖర్ రెడ్డి మాటలని జగన్ రెడ్డి పాటిస్తాడా.

 Sonia Gandhi Gives Assurance To Special Status For Ap-TeluguStop.com

లేక తుంగలోకి తొక్కుతాడా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది…ఏపీలో పాదయాత్రలతో దూసుకుపోతున్న జగన్ రెడ్డికి ఒక్క సారిగా సోనియా ప్రకటన ఆలోచనలోకి నెట్టే విధంగా చేసింది.ఇంతకీ సోనియా చేసిన ప్రకటన ఏమిటి.

జగన్ రెడ్డి ని ఆ ప్రకటన ఎలా ఇరకాటంలోకి నెట్టింది అనే వివరాలలోకి వెళ్తే.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి ఊపందుకుంది.ముఖ్యంగా ఎపీకంటే కూడా ముందస్తు ఎన్నికలకి గులాబీ జెండా ఊపేసిన కేసీఆర్ పార్టీ నిర్ణయంతో రాజకీయా సమీకరణాలు మారిపోయాయి…మహాకూటమి ఏర్పడటం.కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవడం వంటి దారుణమైన పరిస్థుతులు కూడా ఉత్పన్నం అయ్యాయి.

ఇదిలాఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణలో భారీ భహిరంగ సభపై నుంచీ మాట్లాడుతూ చేసిన ప్రకటనలు ఇప్పుడు జగన్ ని కలవార పెడుతున్నాయి.అదేనంటే.

తెలంగాణలో సమస్యలపై మాట్లాడుతూ సోనియా అదే సమయంలో ఎపీకి తీరని అన్యాయం జరుగుతోందని ప్రత్యెక హోదా ఇవ్వాల్సిన బీజేపీ కావాలని తొక్కి పెడుతుందని మేము అధికారం లోకి వస్తే వచ్చిన రోజున తొలి సంతకం హోదాపైనే ఉంటుందని తెలంగాణలో సేటిలర్స్ ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేసింది ఈ ప్రకటనతోనే జగన్ ఇరకాటంలో పడ్డారు ఎందుకంటే…

గతంలో, ప్రస్తుతం కూడా జగన్ హోదా పై మాట్లాడాడే క్రమంలో ఎవరు హోదా ఇస్తామని ఆ మాటలకి కట్టుబడి ఉంటారో కేంద్రంలో వారికే మా మద్దతని చెప్పడం ఈ క్రమంలోనే బీజేపీ హోదా ఇచ్చేది లేదని తేల్చేయడం.సోనియా కాంగ్రెస్ అధికారంలోక్ వస్తే హోదా ఇస్తానని చెప్పడంతో మాటమీద నిలబడే జగన్ కి ఇప్పుడు అతిపెద్ద సంకట పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు.ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మాట మీద నిలబదతాడా లేక.మడమ తిప్పేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube