కేంద్రంపై సోనియా గాంధీ ఫైర్..!

కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోనియా గాంధీ ఫైర్ అయ్యారు.కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు.

 Sonia Gandhi Fire On Central Government About Corona-TeluguStop.com

కరోనా విషయంలో చాలా అలసత్వంతో ప్రభుత్వం పనిచేసిందని అన్నారు.కరోనా పై పోరాటంలో అందరిని కలుపుకోవాల్సింది పోయి కొన్ని రాష్ట్రాల పై వివక్ష చూపించారని సోనియా ఆరోపించారు.

కరోనా పరిస్థితులపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వర్చువల్ మీటింగ్ ఏర్పరచుకుంది.దీనిలో కరోనాని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు.

 Sonia Gandhi Fire On Central Government About Corona-కేంద్రంపై సోనియా గాంధీ ఫైర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి పరిస్థితిని జాతీయ స్థాయిలో ఓ సవాల్ గా పరిగణించామని.అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాల మధ్య తేడాని చూపించిందని విమర్శించారు.

ఏడాది టైం ఉన్నా సరే సెకండ్ వేవ్ ను నిలువరించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు సోనియా గాంధీ.ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే సలహాలను స్వీకరించడానికి బదులుగా ఎదురుదాడికి దిగారని అన్నారు.

ఈ సమావేశంలో వివిధ అంశాలను చరించిన సోనియా కేంద్రానికి కరోనాని ఎదుర్కునే విషయంలో కొన్ని సూచనలను చేసింది.వ్యాక్సినేషన్ విషయంలో ముఖ్య సలహాలను ఇచ్చింది.

సోనియా గాంధీ సూచనల ప్రకారం 25 ఏళ్లు పై బడిన వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి కోరారు.కరోనాని నివారించేందుకు కావాల్సిన వైద్య పరికరాలను, ఔషధాలు ఇతర సామాగ్రి మీద జి.ఎస్.టి రద్దు చేయాలని కోరారు.ఇతర ఆంక్షలు కూడా ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తాయని ఆమె అన్నారు.పేదలు, రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని అన్నారు.అంతేకాదు అర్హులైన వారందరి ఖాతాలో 6000 రూపాయలు జమ చేయాలని సోనియా కోరారు.

#Covid Control #Sonia Gandhi #Fire #Modi Govt #SoniaGandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు