ఫలితాలపై విశ్లేషణ.. త్వరలో సిడబ్ల్యుసీ సమావేశం..!

ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చూపించింది.కేరళలో తప్ప అన్నిచోట్ల కాంగ్రెస్ ఘోఋఅ ప్రభావాన్ని పొందింది.

 Sonia Gandhi Disappointed Election Results-TeluguStop.com

ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.వచ్చిన ఫలితాల నుండి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఫలితాలపై విశ్లేషణ జరిపేందుకు త్వరలోనే సిడబ్ల్యుసీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సోనియా గాంధీ వెల్లడించారు.

 Sonia Gandhi Disappointed Election Results-ఫలితాలపై విశ్లేషణ.. త్వరలో సిడబ్ల్యుసీ సమావేశం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేరళలో కాంగ్రెస్ 2016లో వచ్చిన స్థానాల్లో కేవలం ఒక సీటు మాత్రమే కోల్పోయి 41 స్థానాలను రాబట్టుకుంది.

మరోపక్క బీజేపీ కేరళలో ఒక సీటు కూడా గెలవలేదు.తమిళనాడులో డి.ఎం.కేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అక్కడ 25 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాలు సొంతం చేసుకుంది.ఇక ఎన్నికల్లో విజయం సాధించిన టీ.ఎం.సీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటుగా డి.ఎం.కే స్టాలిన్ కు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది ఏపీలో పరిస్థితి తెలిసిందే.

అయితే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పట్టుకోల్పోతుందని తెలుస్తుంది.  తెలుగు రాష్ట్రాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టేలా కార్యచరణ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

 తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పనితీరుపై సమీక్ష నిర్వహించనుంది పార్టీ అధిష్టానం.ఇక్కడ పార్టీ పురోగతి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేతలను సూచిస్తున్నారు.

#Sonia Gandhi #CWC Meeting #"Disappointed #SONIA #AICC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు