ఆజాద్ అధికారాలకు చెక్ పెట్టిన సోనియా

తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా పతనం చేయడం గాంధీల కుటుంబానికి అలవాటే ఈ దరిద్రమే పాపం ఆనాడు పీవి లాంటి మహానుభావుని పార్టీకి దూరం చేసింది.ప్రతిపక్ష స్థాయికి తగినన్ని సీట్ లు కూడా గెలవలేక వరుసగా రెండవసారి ఈ స్థాయికి దిగజారిన కాంగ్రెస్ పార్టీ తమ తప్పులను విశ్లేషించుకోకుండా మరోమారు తమకు ఎదురు తిరిగాడని ఓ నాయకుడిని తొక్కేయడానికి చర్యలు ప్రారంభించింది.

 Sonia Gandhi Appoints Sideline Dissenterss,  Jairam Ramesh, , Sonia Gandhi, Cong-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే నాయకత్వ తీరును ప్రశ్నిస్తూ పార్టీలోని సంస్కరణలపై సోనియాకు లేఖ రాసిన 23మందిలో ఒకరైన ఆజాద్.రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సీరియస్ అయ్యి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.

దీనితో ఆయనను కూల్ చేయడానికి పార్టీ అధిష్టానం మరియు కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా కృషి చేసి ఆయన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు.

ఆజాద్ కూల్ అవ్వడంతో ప్రస్తుతం సోనియా ఆయనకు అప్పగించిన అధికారాలను కత్తిరించడం ప్రారంభించినట్లు తెలుస్తుంది.

రాజ్యసభలో ప్రభుత్వం తీసుకొచ్చే అంశాలపై పార్టీవైఖరిని సమగ్రంగా ఉంచడం కోసం అహ్మద్‌ పటేల్‌, గాంధీల వీరవిధేయుడైన కేసీ వేణుగోపాల్‌ ను ప్రధానకార్యదర్శిగా ఓ కమిటీని ప్రత్యేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో స్వయంగా సోనియా చీఫ్‌ విప్‌గా జైరామ్‌ రమేశ్‌ను నియమించారు.

దీనితో ఇక నుండి ఆజాద్ స్వతంత్రంగా వ్యవహరించడం సాధ్యంకాదని అందుకే సోనియా ఇలాంటి స్టెప్ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube