ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్..!  

sonia gandhi discharged from hospital sonia gandhi, congress leader, delhi, gangaram hospital, normal checkup, - Telugu Congress Leader, Delhi, Gangaram Hospital, Normal Checkup, Sonia Gandhi

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు.సోనియా గాంధీని జూలై 30వ తేదీన ఢిల్లీ లోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.

 Sonia Gandhi Congress Leader Delhi Gangaram Hospital

కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.సోనియా గాంధీ గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆస్పత్రిలో చేరగా ఆమెకు సాధారణ పరీక్షలు నిర్వహించారు.

రెస్పిరేటరీ మెడిసిన్ నిపుణులైన డాక్టర్ అరూప్ కుమార్ బసు పర్యవేక్షణలో సోనియా గాంధీకి పరీక్షలు నిర్వహించారు.

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆస్పత్రి నుంచి విడుదలయ్యే సమయానికి సోనియా గాంధీకి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు.

ఫిబ్రవరిలో ఆమెకు పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.గతంలో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.

#Delhi #Normal Checkup #Congress Leader #Sonia Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonia Gandhi Congress Leader Delhi Gangaram Hospital Related Telugu News,Photos/Pics,Images..