కాంగ్రెస్ సారధి గా మరోసారి సోనియా  

Sonia Gandhi Appointed As Interim Congress Chief-

గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ సారధి ఎంపిక ఫై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ పార్టీ సారధి గా పలువురు పేర్లు ప్రకటించినప్పటికీ చివరికి సోనియా గాంధి కే పార్టీ పగ్గాలు అందించినట్లు తెలుస్తుంది. గాంధీ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారు అంటూ కొద్దీ రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే..

కాంగ్రెస్ సారధి గా మరోసారి సోనియా -Sonia Gandhi Appointed As Interim Congress Chief

అయితే ఊహాగానాలకు తెరదించుతూ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తాత్కాలికంగానే కొనసాగే అవశాకాలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. త్వరలో మరోసారి సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకున్నట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.

పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవడంతో సోనియాకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. గత 19 ఏళ్లు గా కాంగ్రెస్ సారధి గా కొనసాగిన సోనియా గాంధీ 2017 లో అనారోగ్యం కారణం గా తన కుమారుడు రాహుల్ గాంధీ కి అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడం తో ఓటమికి భాద్యత వహిస్తూ రాహుల్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

దీనితో కాంగ్రెస్ సారధిగా ఎవరిని ఎన్నుకుంటారు అన్న విషయం లో ఉత్కంఠత నెలకొనింది. అయితే పార్టీ బాధ్యతలను మరో వ్యక్తికి అప్పగిస్తే చీలిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడడం తో సోనియా గాంధీ తిరిగి భాద్యతలు తీసుకోవాలని కోరారు.

దీనితో చివరికి సోనియా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.