కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుండి అశోక్ గెహ్లాట్ ఔట్.. అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌?

రాజస్థాన్‌లో రాజకీయాల్లో మరోసారి గందరగోళం నెలకొంది.అశోక్ గెహ్లాట్ వర్గం, సచిన్ పైలట్ వర్గం ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.

 Sonia Gandhi And Rahul Gandh  Feels Humiliating After Ashok Gehlot Revolt Ashok-TeluguStop.com

రాజస్థాన్ ప్రభుత్వంలో మళ్లీ తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది.ఇటీవల, సచిన్ పైలట్ రాజస్థాన్ ప్రభుత్వంలోని కొందరూ మంత్రులు, ఎమ్మెల్యేలపై రహస్యంగా భేటీ అయ్యీరు.

ఆ తర్వాత పైలట్ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ, అతను (అశోక్ గెహ్లాట్) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక కాలేడంటూ గెహ్లాట్‌పై బహిరంగంగా విమర్శులు చేశాడు.మరోవైపు గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నమన్నారు.

సోనియా గాంధీ పిలుపునిస్తే.మా కార్యకర్తలందరూ ఐక్యంగా పోరాడుతాం.

రక్తం చిందించేందుకు, తూటాలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యవహారం మాత్రం ఎవరికి అర్ధం కావడం లేదు.

అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యవలో రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్‌లో 82 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు.

సచిన్ పైలట్‌ను సీఎం చేయకుండా అడ్డుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం తీవ్ర గందగోళానికి దారి తీసింది.ఈ గందరగోళం మధ్య ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించలేక అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీకి తిరిగి వచ్చారు.

అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీకి తిరిగి వచ్చి సోనియా గాంధీకి పరిస్థితిని వివరించనున్నారు.

ఈ ఎపీసోడ్‌లో అశోక్ గెహ్లాట్ వైఖరి నమ్మక ద్రోహమని, అవమానకరంగా ఉందని పార్టీ నాయకత్వం గుర్తించింది.

ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక నుంచి అశోక్ గెహ్లాట్‌ను తప్పించాలనే చర్చ జరుగుతోంది.దీంతో కమల్ నాథ్ ఢిల్లీలో అధ్యక్ష పదివి కోసం లాబియింగ్ జరుపుతున్నారు.

దీంతో కమల్‌నాథ్‌కు ఈ పదవి దక్కుతుందనే అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube