స్టార్ హీరోయిన్ ని హడలెత్తేంచిన ఉబెర్ డ్రైవర్.... 

ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తాజాగా లండన్ లో వింత అనుభవాన్ని ఎదుర్కొంది.దీంతో ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.

 Sonam Kapoor Uber Car Driver-TeluguStop.com

ఇందులోభాగంగా సోనమ్ కపూర్ ప్రస్తుతం తన భర్తతో పాటు లండన్ లో ఉంటున్నానని, తాజాగా పని నిమిత్తం బయటికి వెళ్లాల్సి రావడంతో  ఉబర్ క్యాబ్ ని బుక్ చేసుకున్నానని అన్నారు.అయితే  ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రవర్తన తనకు నచ్చలేదని మరియు అతడు తనతో చాలా వింతగా ప్రవర్తించాడని దీంతో ఎప్పుడెప్పుడు తన గమ్యస్థానం వస్తుందా అని దీనంగా ఎదురు చూసినట్లు చెబుతోంది ఈ అమ్మడు.

అయితే ఈ విషయాన్ని సోనం కపూర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.అంతేగాక లండన్ లో ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని, అంతేగాక ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థని ఉపయోగించాలని సూచించారు.

అయితే ఈ విషయంపై సూపర్ సంస్థ అధికారులు స్పందించారు.ఇందులో భాగంగా సోనం కపూర్ కి క్షమాపణలు చెప్పారు. అంతేగాక డ్రైవర్ యొక్క ఐడి మరియు బుకింగ్ వివరాలు ఇవ్వాలని అతడి పై చర్యలు తీసుకుంటామని కోరారు.

Telugu Bollywoodsonam, Sonam Kapoor, Sonamkapoor, Sonam-Movie

అయితే సోనం కపూర్ మాత్రం తాను అప్పటికే ఫిర్యాదు కూడా చేశానని కానీ అవన్నీ డిస్కనెక్ట్ అయిపోయాయని  అన్నారు.అంతేగాక జరగాల్సిందంతా అప్పుడే జరిగిపోయిందని ఇంక మీరు ఇప్పుడు చేసేది ఏమీ లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే సోనం కపూర్ ఇలా చేదు అనుభవాలు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి కాదు ఇది రెండోసారి.

ఇంతకు ముందు బ్రిటిష్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న సమయంలో తన మూడు లగేజ్ బ్యాగులు మిస్ అయ్యాయి.దీంతో ఈ అమ్మడు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube