మార్లిన్ మాన్రో గెటప్ లో దర్శనం ఇచ్చిన సోనమ్ కపూర్

ప్రపంచం మెచ్చిన, హాలీవుడ్ ని ఆశ్చర్యానికి గురిచేసిన అందాల సుందరి ఎవరంటే టక్కున చాలా మంది మార్లిన్ మాన్రో పేరు చెప్పేస్తారు.ఈ తరం వారికి కొత్తగా ఆమెని పరిచయం చేయలేమో కానీ, హాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలిన మహారాణి మార్లిన్ మాన్రో గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.

 Sonam Kapoor Transforms Into Marilyn Monroe, Bollywood, Hollywood, Halloween Day-TeluguStop.com

లేటు వయసులో కూడా ఏ మాత్రం వన్నె తగ్గని అందం ఆమె సొంతం.సుదీర్ఘకాలం హాలీవుడ్ కెరియర్ కొనసాగించిన మార్లిన్ ఆహార్యం, ఫ్యాషన్, స్టైల్ ని ఇప్పటికి చాలా మంది హీరోయిన్లు అనుకరిస్తూ ఉంటారు.

ఆమెలా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు.అందాల ప్రపంచానికి ఫ్యాషన్ గురించి నేర్పించింది ఆమెనే అని చెప్పాలి.

అలాంటి గెటప్ లో ఇప్పుడు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కనిపించి సందడి చేసింది.
హాలోవీన్‌ డేని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

మార్లిన్‌ మాన్రో అవతారంలో దర్శనమిచ్చింది.సెలబ్రెటీ కుటుంబాలలో ఈ డే ఒక సందడి వాతావరణం ఉంటుంది.

హాలోవీన్ డే సందర్భంగా ఎవరికీ నచ్చిన అవతారాలలో వారు కనిపిస్తారు. కొందరు దెయ్యాలుగా మారిపోతే, మరికొందరు ఏంజెల్స్ గా సందడి చేస్తారు.

కరోనా సిచువేషన్ లేకుంటే సెలబ్రెటీలు ఈ హాలోవీన్ పార్టీలు చాలా గ్రాండ్ గా చేసుకునేవారు.ఇప్పుడు సోనమ్ కపూర్ కూడా సేమ్‌ టు సేమ్‌ మార్లిన్‌ మాన్రోలా మారిన విధానం చూపిస్తూ ఓ వీడియోని షేర్‌ చేసింది.

అంతే కాదు ప్రేక్షకులను కూడా తనని హాలోవీన్‌కి ఎలా ఉండాలో, ఎలా తయారవ్వాలో తెలపమంటూ కోరింది.అలాగే తన ఇమేజ్‌లతో క్రియేట్‌ చేసిన వింత వింత ఆకారాలను తనకు పంపిస్తే అందులో నుంచి విన్నర్స్‌ ని ప్రకటిస్తానని తెలుపుతూ మూడు ఫొటోలని కూడా ఆమె పోస్ట్ చేసింది.

మొత్తానికి సోనమ్ వేసిన మార్లిన్ మాన్రో గెటప్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube