నేను దీపికలా దిగజారలేను

బాలివుడ్ అలనాటి నటుడు అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ అసలు ఎవరికీ భయపడదు.వెనకాల పెద్దగా హిట్స్ లేకున్నా, తనని ఎవరు తక్కువ అంచనా వేసినా ఊరుకోదు సోనమ్.బాలివుడ్ నెం.1 కథానాయిక దీపిక పదుకొనే, సోనమ్ కపూర్ , ఇద్దరు బద్ద శతృవులు.ఒకరంటే ఒకరికి అస్సలు పడదు.పబ్లిక్ గానే ఒకరిని ఒకరు తిట్టేసుకుంటారు.

 Sonam Deepika Fight Takes A Turn-TeluguStop.com

విషయం ఏమిటంటే, ఓ బాలివుడ్ వెబ్ సైట్ లో దీపిక, సోనమ్ పేర్లు చెప్పకుండా ఒక రహస్య కథనం ప్రచురించారు.సోనమ్ ” ప్రేమ్ రతన్ ధన్ పాయో” కి తానే సరైన ఎంపిక అని బాగా విర్రవీగుతోందని, ఆవిడకన్నా ముందే దీపికకు ఈ అవకాశం వచ్చినా, తను వదులుకుంది, దీపికను మించిన వారు ఎవరు ఆ పాత్రకు లేరు, కాని సోనమ్ తానె సరియైనదనే భ్రమలో ఉంది.

నిజానికి తను సల్మాన్ సినిమాలో ఆకట్టుకోలేకపోతోందనేది వాస్తవం అని ఆ కథనం యొక్క సారాంశం.

ఇది దీపిక పీ.ఆర్ టీమ్ రాయించిన కథనం అని సోనమ్ అభిమాని ఒకరు విషయాన్ని తన వద్దకు తీసుకెళ్లగా … సోనమ్ ట్విట్టర్ లో ఈ రకంగా సమాధానం ఇచ్చింది.“@SonamsHeart because I can fight my own battles and I don’t want to stoop down to anyone’s level.It’s just jealousy!”

” నా యుద్ధాన్ని నేనే పోరాడగలను, నాకు వేరేవాళ్ళ స్థాయికి పడిపోవాలని ( దిగాజారాలని ) లేదు, అది వాళ్ళకి నా మీద ఉన్న ఈర్ష్య ” అంటూ దీపిక మీద నోరు పారేసుకుంది.

ఒకవేళ ఈ కథనం నిజంగానే దీపిక రాయిస్తే సరి, కాని ఇది దీపిక రాయించకపోయి ఉంటె గొడవ ఇంకా పెద్దగా అవుతుంది.

అదికాక అప్పుడు తప్పంతా సోనమ్ దే అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube