ఎన్నికల్లో ఓట్లకంటే టిక్‌టాక్ లైకులే ఎక్కువ.. పాపం!

హర్యానా రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో పార్టీల గెలుపును కోరుతు తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.గెలుపే లక్ష్యంగా కొత్త పాత అనే తేడా లేకుండా పాపులారిటీ ఎక్కువ ఉన్న వారికి పిలిచి మరీ పట్టం కట్టాయి రాజకీయ పార్టీలు.

 Sonali Phogat Gets Less Votes Than Her Tiktok Likes-TeluguStop.com

వీరిలో ఎక్కువ మంది భాజపా పార్టీకి చెందినవారే ఉన్నారు.

వారిలో ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టిక్‌టాక్ సెలిబ్రిటీ సోనాలి ఫోగాట్ కూడా ఒకరు.

ఆమెకు టిక్‌టాక్‌లో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఆమె చేసే ప్రతి వీడియోకు సగటున 1.56 లక్షల లైకులు వస్తుంటాయి.దీంతో ఆమె టిక్‌టాక్ లైకులను ఓట్లుగా మార్చుకోవాలని చూసింది బీజేపీ పార్టీ.

అయితే గురువారం వెల్లడైన ఫలితాల్లో మాత్రం దానికి విరుద్ధంగా ఆమెకు వచ్చిన ఓట్లు కేవలం 34,222 మాత్రమే.అంటే ఆమె వీడియోకు వచ్చే సగటు లైకులకంటే తక్కువ.

దీంతో సోనాలీకి అభ్యర్థత్వం ఇచ్చి చేతులు కాల్చుకుంది బీజేపీ పార్టీ అంటున్నారు కొందరు.కానీ అసలు వాస్తవం ఏమిటంటే.

సోనాలి కారణంగా ఆదంపూర్ నియోజకవర్గంలో 2014లో ఆ పార్టీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు కేవలం 8311 మాత్రమే అని.ఈసారి అవి 34,222కు పెరిగాయని తెలిపాయి పార్టీ వర్గాలు.ఏదేమైనా ఆదంపూర్ నియోజకవర్గంలో భాజపా ఓట్ల సంఖ్యను పెంచుకోగలిగామని పార్టీ సంతోష పడుతోంది.మొత్తానికి ఎన్నికల ఓట్ల ద్వారా మరోసారి సోనాలి ఫోగాట్ పాపులర్ అయ్యిందని అంటున్నారు అక్కడి జనం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube