ఈ ఎన్టీఆర్ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు రుద్ర రాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన  “సుబ్బు” అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా నటించినటువంటి ముంబై బ్యూటీ సోనాలీ జోషి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాలు కావడంతో ఇప్పటి తరం సినీ ప్రేక్షకులకి ఈమె గురించి పెద్దగా తెలియపోవచ్చు.

 Sonali Joshi, Telugu Heroine,subbu, Jr Ntr, Tollywood-TeluguStop.com

అయితే తెలుగులో సోనాలి జోషి నటించినటువంటి సందడే సందడి, సుబ్బు, నాన్న నేను అబద్ధం తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.అయితే అప్పట్లో ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి సోనాలి జోషి కొంతకాలం పాటు పలు వ్యక్తిగత కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరమైంది.

దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ సినీ కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేకపోతున్నాయి.

అయితే తాజాగా నటి సోనాలి ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే సినీ జీవితం పరంగా తన కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతోనే నటి సోనాలి జోషి సెకండ్ ఇన్నింగ్స్ కొంతమేర సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్ నటీనటులు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు అంతేగాక పలు చిత్రాలలో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.

అందువల్లనే నటి సోనాలి జోషి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్  వెబ్ సీరీస్ తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube