సోనాలి బింద్రేపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు.. కారణం ఇదే!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సోనాలి బింద్రే ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడింది.

 Sonali Bendre On World Cancer Day Life Is Altering , Sonali Bindre , World Cance-TeluguStop.com

ఆ సమయంలో ఆమె అభిమానులు ప్రముఖులు ఎంతో మంది ఆమె తొందరగా కోలుకోవాలని ఎంతగానో వేడుకున్నారు.చివరికి అందరూ కోరుకున్న విధంగానే సోనాలి బింద్రే క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిని జ‌యించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.2018లో మెటాస్టాటిక్ క్యాన్స‌ర్ బారిన ప‌డిన సోనాలి బింద్రే మ‌నో ధైర్యంతో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బ‌య‌టకొచ్చింది.

ఆపరేషన్ సమయంలో ఆమె మనోధైర్యంతో పాటు ఆమెకు ఆమె భ‌ర్త‌, కుటుంబస‌భ్యులు ఎంతో అండ‌గా నిలిచారు.

అయితే ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స‌మ‌యంలో సోనాలి చెప్పిన మాట‌లు అభిమానుల‌ను, స్నేహితుల‌ను క‌దిలించాయి.ఇక తాజాగగా వ‌ర‌ల్డ్ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా ఆమె మ‌రోసారి ఆ విషయాల గురించి స్పందించింది.

క్యాన్సర్ వైరస్ జీవితాన్ని మరొక దారిలోకి తీసుకెళ్తుందని, జీవితాన్ని మాత్రం అడ్డుకోదని, కానీ క్యాన్సర్ బారినపడిన వాళ్లు మాత్రం జీవితంలో ఎంతో కష్టమైన పరిస్థితిలో ఉన్నట్లే అని ఆమె తెలిపింది.

అలాంటి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలని, అదే విధంగా వారికి మనోధైర్యాన్ని అందించాలని, వాటితో పాటుగా రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని ఆమె తెలిపింది. తొలిదశలో క్యాన్సర్ ను నయం చేసుకోవడం చాలా సులువు అని, కానీ ఆ తర్వాత ఆ క్యాన్సర్ ముదిరితే దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని ఆమె సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చింది.సోనాలి బింద్రే క్యాన్సర్ నుంచి జయిచడంతో బాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

నువ్వు పోరాట యోధురాలు అని కామెంట్స్ చేస్తున్నారు.అదేవిధంగా నీకు ఉన్న మనోధైర్యం చాలా ఎక్కువ అంటూ ప్రశంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube