కాన్సర్ బాధితుల్లో సినీ ప్రముఖులే ఎందుకు ఎక్కువో తెలుసా.? ప్రధాన కారణం ఇదే.!       2018-07-04   22:58:09  IST  Raghu V

బాలీవుడ్‌ నటి సోనాలీబింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌ లో చికిత్స తీసుకుంటున్నారు. “కొన్నిసార్లు జీవితం నుంచి తక్కువగా ఆశిస్తుంటాం. జీవితం మలుపులతో కూడిన పరీక్షలాంటిది. నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. నిజానికి నేను ఏ మాత్రం ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్‌ ఉందని తేలింది. అప్పటి నుంచి నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాపై మంచి ఆదరణ చూపిస్తున్నారు ఇది నా అదృష్టం” అంటూ సోనాలీ బింద్రే తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.

అయితే సినీ నటులు చాలా మంది కాన్సర్ బారిన పడుతూ ఉంటారు. మొదట్లో శ్రీదేవికి కూడా కాన్సర్ అన్నారు. తర్వాత మనీషా కొయిరాలాకు కాన్సర్. ఇలా ఎంతో మంది హీరోయిన్లు కాన్సర్ భారిన పడ్డారు. అసలు దీనికి కారణం ఏంటి?

సినీ రంగం అంటే రంగుల లోకం. తెర మీద అందంగా కనిపించడమే వారి లక్ష్యం. దానికోసం ఎన్నో సర్జరీలు చేయించుకుంటారు. వయసు మీరినట్టు కనిపించకూడదు అని ఎన్నో ట్రీట్మెంట్ లు చేయుంచుకొని మందులు వాడుతూ ఉంటారు. కొంచెం అందం తగ్గినా వారికి చాన్సు లు తగ్గిపోతాయి. పోటీ ప్రపంచంలో నిలతోక్కుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఆహారపు అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి సినిమా వాళ్ళవి. అవకాశాలు తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఉపయోగించే కాస్మెటిక్స్ ఏ వారికి కాన్సర్ రావడానికి ప్రధాన కారణం.

షాంపూల కారణంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ తో పాటు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన రోగాల బారీన పడే అవకాశం ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో వెల్లడయింది. ఎక్కువగా ఉపయోగించే షాంపూలు, కాస్మొటిక్ పదార్దాలు, బాడీ లోషన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల ద్వారా మహిళల్లో ‘రొమ్ము క్యాన్సర్’ వచ్చే అవకాశం పెరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది..