నా కెరీర్ లో మొదటిసారి ఇలాంటి చిత్రంలో నటించా: సోనాల్ చౌహాన్

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Sonal Chauhan Talks About F3 Movie , Victory Venkatesh, Sonal Chauhan, F3 Movie, Tollywood-TeluguStop.com

ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా తమన్నా నటించగా , వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో మరొక హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తేలిసిందే.ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‪టైనర్‪గా తెరకెక్కబోతున్న విషయం మనందరికి తెలిసిందే.

 Sonal Chauhan Talks About F3 Movie , Victory Venkatesh, Sonal Chauhan, F3 Movie, Tollywood-నా కెరీర్ లో మొదటిసారి ఇలాంటి చిత్రంలో నటించా: సోనాల్ చౌహాన్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీ గా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా బ్యూటీ సోనాల్ చౌహాన్.మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమాకి సంబందించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.సినిమాలో మీ పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుందా అని ప్రశ్నించగా. ఎఫ్ 2 సినిమాల్లో ఎఫ్ 3 సినిమాలో భారీ తారాగణం ఉంది అని తెలిపింది.అలాగే సినిమాలో అన్ని పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉంటుందని,ఆమె పాత్ర విషయానికి వస్తే.కథలో కీలకమైన పాత్ర అని తెలిపింది.

అంతేకాకుండా ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయడం తన కెరీర్ లో ఇదే మొదటి సారి అని, ఎఫ్ 3 లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా చేయడం తనకు ఒక చాలెంజింగ్ గా అనిపించింది అని చెప్పుకొచ్చింది సోనాల్ చౌహాన్.

ఎందుకంటె కామెడీ చేయడం అంత తేలికైన విషయం కాదు అని తెలిపింది.ఎఫ్ 3 ప్రాజెక్ట్‪లో అవకాశం ఎలా వచ్చింది? అని అడగగా.ఒకరోజు అనిల్ గారి నుంచి ఫోన్ వచ్చింది.ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను.ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను అని అనిల్ రావిపూడి చెప్పగానే ఆమె మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసిందట.

అనిల్ ఒక కామెడీ కింగ్ అని అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశానని,అది ఒక హిలేరియస్ సినిమా అని,ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది అని చెప్పు కొచ్చింది సోనాల్ చౌహన్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube