ఆసనాలకి కొత్త అర్ధం చెబుతున్న బాలయ్య హీరోయిన్

ముంబై భామ సోనాల్ చౌహాన్ తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలలో నటించింది.అలాగే ప్రస్తుతం బోయపాటి సినిమా కోసం మళ్ళీ ఈ అమ్మడుని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

 Sonal Chauhan Takes Up Aerial Yoga Asanas, Bollywood, Tollywood, Celebrities, He-TeluguStop.com

కెరియర్ పరంగా అంతంత మాత్రంగానే అవకాశాలు ఉన్న మోడలింగ్ లో దూసుకుపోతున్న సోనాల్ చౌహాన్ ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది.ఇక తన ఫిట్ నెస్ యాక్టివిటీస్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అందాల ప్రదర్శనలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టని సోనాల్ ఫిట్ నెస్ చేసే సమయంలో కూడా గ్లామర్ లుక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి నిద్ర లేకుండా చేస్తుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందాల భామలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

ఈ నేపధ్యంలో రెగ్యులర్ ఫిట్ నెస్ కి కాస్తా కష్టం అయిన కూడా ఆసనాల ద్వారా ఫిట్ నెస్ డిస్టర్బ్ కాకుండా కేరింగ్ తీసుకుంటున్నారు.తాజాగా సోనాల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలకు మూడు లవ్ సింబల్స్ తో క్యాప్షన్ ఇచ్చింది.ఫోటోలలో ఓ యోగా మ్యాట్ పై ఒక ఆసనం వేసింది.

ఈ ఆసనం పేరేంటో తెలియదు కానీ ఒక కాలిని పైకెత్తి మరోచేతితో పట్టుకోవడంతో లవ్ సింబల్ కనిపిస్తోంది.ఇలా ఆసనాలు వేసే దాంట్లో కూడా భావాన్ని వ్యక్తం చేసే విధంగా వాటికి కొత్త భాష్యం ఈ అమ్మడు చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఆసనాలతో ఓ వైపు ఫ్యాన్స్ ని కవ్విస్తూనే మరో వైపు ఫిట్ నెస్ కోసం బరువులు ఎత్తాల్సిన పని లేదు.ఇలా కూడా చేయొచ్చు అని సలహాలు ఇచ్చినట్లు ఉంది.

మరి అమ్మడి ఆసనాలు చూసిన తర్వాత ఎవరికైనా ఇంట్లో లాక్ డౌన్ టైంలో ఇలా చేయొచ్చు కదా అని అనుకోకుండా ఉండరు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube