ఎఫ్ 3’ షూటింగ్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన్

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు.ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు.ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 Sonal Chauhan Joins F3 Shooting , Sonal Chauhan,  F3, Dil Raju, Sri Venkateswara-TeluguStop.com

తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు.ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌తో దాదాపు ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు.

సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube