నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సోనాల్ చౌహాన్, వేదిక నటించారు.
అయితే వీరిలో సోనాల్ చౌహాన్ బాలయ్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టింది.
గ్లామరస్ రోల్ కోసం సోనాల్ చౌహాన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినప్పుడు ఆమె కళ్లు చెదిరే రమ్యునరేషన్ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ గత సినిమాల్లోలాగా ఈ సినిమాకు కూడా బాగా ఉపయోగపడుతుందని భావించిన దర్శకనిర్మాతలు ఆమె కోరినంత మొత్తాన్ని అప్పజెప్పారట.రూలర్ సినిమాలో నటించినందుకు గాను సోనాల్ చౌహాన్ ఏకంగా రూ.60 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంత మొత్తం సోనాల్ చౌహాన్‌కు ఉన్న మార్కెట్‌కంటే ఎక్కువే.అయినా కూడా నిర్మాత సి.కళ్యాణ్ వెనకడుగు వేయకుండా ఆమె కోరినంత ఆమెకు ఇచ్చినట్లు తెలుస్తోంది.బాలయ్యతో మూడో సినిమా కావడంతో అమ్మడు ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉందట.ఏదేమైనా బాలయ్య పుణ్యమా అని ఈ బ్యూటీ మార్కెట్‌ను మించిన రెమ్యునరేషన్‌ను వెనకేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.