బాలయ్య బాబు మళ్ళీ సోనాల్ నే నమ్ముకున్నట్లు ఉన్నాడు

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.

 Sonal Chauhan Confirmed For Balakrishna, Tollywood, Boyapati Srinu, Bb3, Sonal C-TeluguStop.com

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.అయితే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బోయపాటి చాలా రోజులుగా హీరోయిన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే సరైన హీరోయిన్ మాత్రం దొరకలేదు.చాలా మంది పేర్లు ప్రయత్నం చేసిన కూడా ఎవరూ వర్క్ అవుట్ కావడం లేదు.

దీనికోసం చిత్ర యూనిట్ కొత్త అమ్మాయిలని కూడా ప్రయత్నం చేస్తున్నారు.అయితే బాలకృష్ణకి కాంబినేషన్ అంటే హీరోయిన్స్ చేయడానికి చాలా మంది ముందుకి రావడం లేదు.

బాలయ్య బాబు సినిమాలలో హీరోయిన్ పాత్రలకి అంతగా ప్రాధాన్యత ఉండదు.అది కూడా బోయపాటి సినిమా అంటే కేవలం పాటలకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.

ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ పై హీరోయిన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

అయితే బాలయ్య బాబు సినిమా అంటే ఈ మధ్య కాలంలో సోనాల్ చౌహాన్ గ్యారెంటీగా ఉంటుందని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోతున్నారు.

తెలుగులో ఆమె చేసినవి ఆరు సినిమాలు అయితే అందులో బాలకృష్ణతోనే నాలుగు సినిమాలు చేసింది.లెజెండ్ సినిమా నుంచి బాలకృష్ణకి బెస్ట్ ఛాయస్ గా ఈ భామ మారిపోయింది.

బాలకృష్ణ సినిమా అంటే కథ గురించి కూడా ఆలోచించకుండా సోనాల్ ఒకే చెప్పేస్తుంది.ఇప్పుడు బోయపాటి సినిమా కోసం సోనాల్ చౌహాన్ ని ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తుంది.

ఇందులో బాలకృష్ణకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ ఉండగా అందులో ఒక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ మీనాని ఎంపిక చేయగా, మరో పాత్ర కోసం అంజలిని ఎంపిక చేశారని, ఇక మూడో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ని ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది.అయితే ఇది ఎంత వరకు నిజం అనేది చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు తెలియదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube