మరోసారి మహేష్‌కు హ్యాండ్‌ ఇచ్చిన సోనాక్షి  

Sonakshi Sinha Rejected Mahesh Babu Movie Sari Leru Nekevvaru-maharshi Movie,sonakshi Sinha,super Star Mahesh Babu

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు జోడీగా నటించాలని ప్రతి ఒక్క సౌత్‌ హీరోయిన్‌ ఆశ పడుతుంది.కాని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా మాత్రం మహేష్‌ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిన ప్రతి సారి కూడా ఏదో ఒక కారణం చెప్పి తప్పుకుంటూనే ఉంది.

Sonakshi Sinha Rejected Mahesh Babu Movie Sari Leru Nekevvaru-Maharshi Sonakshi Super Star

ఆమద్య మహర్షి చిత్రంలో ఒక పాటకు గాను ఈమెను సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి.కాని ఆమె అందుకు ఒప్పుకోలేదు.సౌత్‌ లో ఐటెం సాంగ్స్‌ చేసే ఆలోచన లేదంటూ చెప్పి తప్పించుకుంది.

  ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసేందుకు ఒప్పుకుంది.కాని ఆ పాటను ముందే తనకు వినిపించాలని, అలాగే ఆ పాటను వెంటనే షూట్‌ చేయాలని కండీషన్‌ పెట్టింది.అయితే దర్శకుడు అనీల్‌ రావిపూడి ఆ ఐటెం సాంగ్‌ను చివరకు షూట్‌ చేయాలని భావిస్తున్నాడు.

Sonakshi Sinha Rejected Mahesh Babu Movie Sari Leru Nekevvaru-Maharshi Sonakshi Super Star

దాంతో షూటింగ్‌ ఇప్పుడే పెట్టలేని కారణంగా ఆమెను తప్పించడం జరిగింది.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఐటెం సాంగ్‌ డిసెంబర్‌లో చిత్రీకరించబోతున్నారు.

  సోనాక్షి డిసెంబర్‌లో తనకు వీలు పడదని చెప్పడంతో ఆ స్థానంలో తమన్నాను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

మహేష్‌బాబుకు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ మేజర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఎఫ్‌ 2 చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న అనీల్‌ రావిపూడి ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.

తాజా వార్తలు

Sonakshi Sinha Rejected Mahesh Babu Movie Sari Leru Nekevvaru-maharshi Movie,sonakshi Sinha,super Star Mahesh Babu Related....