బాలయ్యతో తూచ్ అంటోన్న బ్యూటీ

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 Sonakshi Sinha Tweet On Balakrishna Movie-TeluguStop.com

రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య మరోసారి తన సత్తా చూపించేందుకు రెడీ అయ్యాడు.

ఇక మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటూ గతకొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి.బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో నటించనుందనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

దీనికి సంబంధించి పలు వెబ్‌సైట్లు కన్ఫం కూడా చేశాయి.అయితే ఇదంటా ట్రాష్ అంటూ కొట్టిపడేసింది సోనాక్షి.

తాజాగా దబాంగ్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా సోనాక్షి ఈ విషయాన్ని వెల్లడించింది.బాలయ్యతో తన సినిమాపై వస్తున్న వార్తలన్నీ గాలివార్తలే అంటూ కొట్టిపడేసింది.

దీంతో గాలి రాయుళ్లకు చెక్ పెట్టేసింది సోనాక్షి.కాగా ఆమె నటించిన తాజా చిత్రం దబాంగ్ 3 డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

మరి బాలయ్యతో జతకట్టబోయే ఆ బ్యూటీ ఎవరంటూ కొత్త చర్చ టాలీవుడ్‌లో తెరలేచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube