సల్మాన్ ఖాన్ కోడలిగా హీరోయిన్ సోనాక్షి సిన్హా.. సోషల్ మీడియాలో ట్రోల్?

ఎప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టే బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమధ్య వ్యక్తిగత విషయాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో పలువురు స్టార్ జంటలు పెళ్ళికి కూడా సిద్ధం అవుతున్నారు.

 Soankshi Sinha To Become Salman Khans Bahu Details,  Sonakshi Sinha, Salman Khan-TeluguStop.com

ఇటీవలే రాజ్ కుమార్ రావు – పత్ర లేఖలు, అనుష్క రంజన్ – ఆదిత్య సీల్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.బాలీవుడ్ లో మరొక జంట అయిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంతో ఒకటవుతారు.

అలాగే అలియా భట్, రణబీర్ కపూర్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరొక హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఈ లిస్ట్ లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈమె బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్టు తెలుస్తోంది.సోనాక్షి సిన్హా గత కొంత కాలంగా బంటి సచ్ దేవ్ తో డేటింగ్ లో ఉందట.

వీరు మూడు,నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ పలుసార్లు మీడియా కంట కూడా పడ్డారట.

Telugu Bollywood, Bunty Sachdev, Katrina Kaif, Salman Khan, Seema Khan, Sohail K

అయితే ఈ జంట వారి బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మరొక మెట్టు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ఇందుకు సంబంధించి బాలీవుడ్ సినీ వర్గాలలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.బంటి బచ్ దేవ్ సల్మాన్ ఖాన్ కు ఎలా సన్నిహితుడు అనేది చాలామందికి తెలియదు.

సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్, అతడి భార్య సీమాఖాన్ సోదరుడే ఈ బంటి సచ్ దేవ్.చూస్తుంటే త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube