ఆ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదట!

బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సాధించుకున్న హీరోయిన్లు సైతం ఫేడవుట్ అవుతున్నప్పుడు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ నిర్మాతల చుట్టూ తిరుగుతుంటారు.ఇక వారు ఛాన్సుల కోసం చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు.

 Sonakshi Sinha Never Requested For Offer-TeluguStop.com

అయితే తనకు సినిమా ఛాన్సులు లేకపోయినా నిర్మాతలతో అదోరకంగా వ్యవహరించ లేదని చెప్పుకొస్తుందో బాలీవుడ్ బ్యూటీ.

సీనియర్ నటుడు శత్రుజ్ఞ సిన్హా కూతురిగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

దీంతో వరుసబెట్టి సినిమాలు చేస్తూ సక్సె్స్ మీద సక్సె్స్ అందుకుంది.అంతేగాక టాప్ స్టార్లతో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా నటించి తన సత్తా చాటుకుంది.

అయితే అమ్మడు ఈ మధ్య ఫేడవుట్ అవుతుండటంతో ఆమె సినిమాలు చాలా వరకు తగ్గాయి.దీంతో నిర్మాతలను అవకాశాల కోసం అడుగుతుందేమో అని అందరూ అనుకున్నారు.

కానీ తాను ఇప్పటి వరకు ఏ ఒక్క నిర్మాతను కూడా ఆఫర్ ఇవ్వాలనే రిక్వెస్ట్ చేయలేదని బట్టబయలు చేసింది ఈ బ్యూటీ.తనకు ఆఫర్లు లేకపోయినా పర్వాలేదని, తాను మాత్రం సాయం కావాలని మాత్రం అడగనంటూ చెప్పడంతో, ప్రస్తుతం బాలీవుడ్ జనాల్లో సోనాక్షి యాటిట్యూడ్‌ హాట్ టాపిక్‌గా మారింది.

మరి ఈ బ్యూటీ ఎంతవరకు తన మాటపై నిల్చుంటుంది, అసలు సినిమా అవకాశాలనే అడగకుండా ఉంటుందా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube