బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ని అభిమానించే వాళ్ళు ఎంత మంది ఉన్నారో ద్వేషించే వారు కూడా అంతే స్థాయిలో ఉన్నారు.కొత్తవాళ్ళు ఎవరైనా తమకి కాంపిటేషన్ అవుతారు అనుకుంటే వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నం చేస్తారని, అవకాశాలు రాకుండా చేస్తారని, వారసత్వ నటులని ప్రోత్సహిస్తూ ఉంటారని సల్మాన్ ఖాన్ మీద విమర్శలు ఉన్నాయి.
ఇక ప్రముఖ గాయని సోనా మహాపాత్ర అయితే అవకాశం దొరికిన ప్రతి సారి సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది.అతని మీద తీవ్ర విమర్శలు చేస్తుంది.
తాజాగా మరోసారి ఆమె సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసింది.సుశాంత్ విషయంలో అభిమానులని ఉద్దేశించి సల్మాన్ చేసిన ట్వీట్ పై ఆమె రియాక్ట్ అవుతూ అతనిని ఒక విషపూరితమైన వ్యక్తిగా అభివర్ణించింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా మంది సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్ అభిమానులు ఈ విషయంలో రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు.
దీనిపై ఇటీవల సల్మాన్ ఖాన్ స్పందిస్తూ అభిమానులందరూ సుశాంత్ ఫ్యాన్స్‌కు అండగా నిలవాలని, ఆవేదనతో పెట్టె శాపాలు పట్టించుకోవద్దని, సుశాంత్ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఆయన వ్యాఖ్యలపై సోనా స్పందిస్తూ విషపూరిత స్వభావం, పెద్ద మనసు కలిగిన ఓ వ్యక్తి నుంచి కదలిక వచ్చిందని విమర్శించింది.
సల్మాన్ డిజిటల్ పెయిడ్ ఆర్మీ గతంలో ఇతరులను బెదిరించారని, ఆ సమయంలో వాటిపై ఆయన స్పందించలేదని, క్షమాపణ చెప్పడం కూడా అవసరమని ఆయన భావించలేదని ఆమె తెలిపింది.మరి ఇప్పుడు ఇలా స్పందించడం చూస్తూ ఉంటే దీని వెనుక ఏదో ఉందని ఆమె విమర్శలు చెసింది.